మీ శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వు క‌ర‌గాలా..? మెద‌డు షార్ప్‌గా మారాలా..? అయితే రోజూ వెన‌క్కి న‌డ‌వండి చాలు…

వాకింగ్‌తో మ‌నకు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. కొలెస్ట్రాల్ త‌గ్గిపోతుంది. కండ‌రాలు మంచి ఆకృతిని సంత‌రించుకుంటాయి. శ‌రీరానికి చ‌క్క‌ని షేప్ వ‌స్తుంది. ఇంకా అనేక ప్ర‌యోజ‌నాలే ఉన్నాయి. అయితే వాకింగ్ ఎవ‌రైనా ఎలా చేస్తారు..? ఎలా చేయ‌డ‌మేమిటి, ముందుకు న‌డుచుకుంటూ వెళ్ల‌డ‌మే, అన‌బోతున్నారా..? అయితే మీరు చెబుతోంది క‌రెక్టే. కానీ ముందుకు కాకుండా వెన‌క‌కు న‌డుస్తూ కూడా వాకింగ్ చేయ‌వ‌చ్చ‌ట‌. దీంతో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

reverse-walking

1. సాధార‌ణంగా ముందుకు న‌డిచే వాకింగ్‌లో క‌రిగే క్యాల‌రీల కంటే వెన‌క్కి న‌డిచే వాకింగ్‌లోనే ఎక్కువ క్యాల‌రీలు క‌రుగుతాయ‌ట‌.

2. వెన‌క్కి న‌డిచే వాకింగ్‌లో 100 అడుగులు వేస్తే ముందుకు న‌డిచే వాకింగ్‌లో 1000 అడుగులు వేసిన‌ట్టేన‌ట‌.

3. దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు ఉన్న వారు నిత్యం వెన‌క్కి న‌డ‌వ‌డం ప్రాక్టీస్ చేస్తే ఆ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయిట‌.

4. తొడ‌లు, కాళ్లు, ఛాతీ, పొట్ట వంటి భాగాల్లో ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. ఆయా భాగాల్లో ఉన్న కండ‌రాలు ప‌టిష్ట‌మ‌వుతాయి. ఇది బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి బాగా ప‌నిచేసే ఉపాయం.

5. ముందుకు న‌డిచే వాకింగ్‌లో మెద‌డు అంత‌గా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం లేదు. కానీ వెనక్కి న‌డిచే వాకింగ్‌లో మెద‌డు ప‌నిచేస్తూ, ఏకాగ్ర‌తతో ఉంటుంది. కాబ‌ట్టి జ్ఞాప‌క‌శక్తి వంటి స‌మ‌స్య‌లు పోతాయి. అంతేకాదు మెద‌డు ప‌నితీరు మెరుగుప‌డి షార్ప్ అవుతుంది.

6. చైనాలో పురాత‌న కాలంలో ఇలా వెన‌క్కి న‌డిచేవార‌ట‌. దీంతో చాలా మంది త‌మ ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకునే వార‌ట‌. ఇప్పుడు జ‌పాన్‌, యూరోప్ దేశాల్లో ఈ ట్రెండ్ ఎక్కువ‌గా న‌డుస్తోంది.

7. వెన‌క్కి న‌డ‌వడం వ‌ల్ల మోకాళ్లు, కీళ్ల నొప్పుల స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. వెన్నెముక నిటారుగా మారుతుంది. వెన్నెముక స‌మ‌స్య‌లు, నొప్పి త‌గ్గిపోతాయి.

8. వారానికి నాలుగు రోజుల పాటు రోజుకు 10 నుంచి 15 నిమిషాల స‌మ‌యం పాటు వెనక్కి న‌డిస్తే చాలు. దీంతో పైన చెప్పిన ప్రయోజ‌నాల‌న్నీ క‌లుగుతాయి.

9. ముందుకు న‌డిచిన‌ప్ప‌టి కంటే వెన‌క్కి న‌డిచిన‌ప్పుడే గుండె ఎక్కువ వేగంతో కొట్టుకుంటుంద‌ట‌. దీని వ‌ల్ల గుండెకు మంచి కార్డియో ఎక్స‌ర్‌సైజ్ జ‌రిగి గుండె స‌మస్య‌లు తొల‌గిపోతాయి.

10. వెన‌క్కి న‌డ‌వ‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వు ఇట్టే క‌రిగిపోతుందట‌. దీంతో బ‌రువు వేగంగా త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది.

11. సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే వెన‌క్కి న‌డ‌వ‌డ‌మే కాదు, వెన‌క్కి వేగంగా ర‌న్నింగ్ కూడా చేయ‌వ‌చ్చ‌ట‌. దీంతో ఇంకా ఎక్కువ ఫ‌లితం ఉంటుంద‌ని పలు ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

Comments

comments

Share this post

scroll to top