ఎన్నికల్లో ఓడిపోయాక మీడియా ముందుకు మొదటి సారి వచ్చిన రేవంత్ రెడ్డి మాటలు వింటే ఆశ్చర్యపోతారు.!!

కొడంగల్ నియోజక వర్గం నుండి పోటీ చేసిన రేవంత్ రెడ్డి, అనుకోని విధంగా పరాజయ పాలయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయాక మీడియా ముందుకు మొదటి సారి వచ్చారు రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యాక మీడియా తో మాట్లాడుతూ: ” తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి, స్వయంపాలనకు, సామజిక న్యాయానికి విఘాతం కలిగేతట్టు కనిస్తుంది, ఏది ఏమైనా గెలుపు ఓటమి అనేది ఒక సందర్భం మాత్రమే, ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం, శ్రీ మతి ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయి గెలిచిండ్రు, ఎన్టీఆర్ కూడా ఓడిపోయి గెలిచిండ్రు, చంద్ర బాబు నాయుడు ఓడిపోయి గెల్చిండ్రు, రాజా శేఖర్ రెడ్డి గారు గెలిసిండ్రు ఓడిండ్రు గెలిసిండ్రు. మర్రి చెన్నా రెడ్డి, పీవీ నరసింహ రావు లాంటి గొప్పోలు కూడా గెలుపోటములు చూసిండ్రు, కాబట్టి ఏది ఏమైనా పూర్తి స్థాయి విశ్లేషణ పార్టీ నాయకులతో చర్చించుకున్న తరువాత ఫలితాల మీద విశ్లేషణ చేస్తాం, ఎన్నికల్లో తెరాస పార్టీ ఏమైనా గోల్మాల్ చేసిందా అనేది చర్చించిన తరువాత మాట్లాడతాం, ఏది ఏమైనా రాష్ట్ర ప్రజల పక్షాన ప్రతి పక్షం లో ఉండి పోరాడుతాం, ప్రజలు మాకు ప్రతిపక్షం లో ఉండే అవకాశం ఇచ్చారు, గెలుపోటములు సహజం, గెలుపు కి ఉప్పొంగిపోను, ఓటమికి కుంగిపోను, కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపుకి ఉప్పొంగిపోదు, ఓటమికి కుంగిపోదు, ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీ కి. ప్రతి పక్షంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కి బాధ్యత పెరిగింది. ప్రజల కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి మరింత కృషి చేస్తాం, అధికార పక్షం లో ఉండి ఉంటె ఒక రకమైన బాధ్యత ఉండేది మా పైన, ఇప్పుడు ప్రతి పక్షం లో ఉన్నాం కాబట్టి బాధ్యత ఇంకా పెరిగినట్టు, సమగ్ర విశ్లేషణ చేసుకొని ముందుకు కదులుతాం ” అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ఇప్పటికైనా పాలన సరిగ్గా చెయ్యి..

“ఇకనైనా ఫార్మ్ హౌస్ వదిలి సచివాలయానికి వచ్చి పని చెయ్యండి కెసిఆర్ గారు, కుటుంబ సభ్యుల పాలనను వీడండి, ప్రజల కష్టాలను తీర్చండి, మునుపటి లాగ కాకుండా, అమరవీరుల కుటుంబాలను, విద్యార్థులను, నిరుద్యోగులను ఆదుకోవాలి, వాళ్లకు సరైన న్యాయం చెయ్యాలి”, అంటూ రేవంత్ రెడ్డి మీడియా ముందు మాట్లాడారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top