ప్రేమ పేరుతో మోసం చేసిన అమ్మాయి పైన వింతగా ప్రతీకారం తీర్చుకున్న ప్రేమికుడు..!!

అబ్బాయిలు నిజాయితీగా ప్రేమించరు, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో ఒకేసారి చెక్కర్లు నడుపుతారు, అది ఇది అని కామెంట్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నిజాయితీగా ప్రేమించే అబ్బాయిల సంఖ్య కూడా ఎక్కువే అని మర్చిపోతూ ఉంటారు. అమ్మాయిని ప్రాణంగా ప్రేమించి ఆమె చేతిలో మోసపోయాడు ఒక ప్రేమికుడు, దీంతో అతనికి కోపం వచ్చి వింత పద్దతిలో ప్రతీకారం తీర్చుకున్నాడు. వివరాల్లోకెళితే..

పిల్లోడికి అర్ధం కాలేదు..:

అనిక్ సామియా ని గాఢంగా ప్రేమించాడు, సామియా కూడా అనిక్ ని ప్రేమించింది. కానీ అనిక్ ని ప్రేమించే ముందు పక్కా ప్రణాళిక సిద్ధం చేసి మరి అనిక్ ని ప్రేమించింది. 8 నెలలు ఇద్దరు బాగా తిరిగారు, సామియా ని విడిచిపెట్టి ఉండలేనంత స్థాయికి అనిక్ ప్రేమ చేరింది, సరిగ్గా అదే సమయానికి సామియా సాకూలు చెప్పి అనిక్ కి బ్రేక్ అప్ చెప్పింది. ఇంట్లో వాళ్ళు నన్ను ఫోర్స్ చేస్తున్నారు వేరే అతనితో పెళ్లి చేసుకోమని, వాళ్ళ మాట నేను కాదనలేను అంటూ అతనిని విడిచి పెట్టి వెళ్ళిపోయింది, ఇంట్లో వాళ్ళ బలవంతం మీద పెళ్లి చేసుకుంటుంది కదా అని అనుకున్నాడు అనిక్, కానీ అనిక్ ఫ్రెండ్స్ సామియా అసలు రూపాన్ని బయటపెట్టారు. అనిక్ ని వాడుకొని వదిలేయాలని సామియా ప్లాన్ వేసింది, లాస్ట్ కి సామియా అనుకున్న విధంగానే అనిక్ ని వాడుకొని వదిలించుకుంది. మ్యాటర్ అర్ధమయ్యే సరికి ఒక విచిత్రమైన ఆలోచనతో ముందుకొచ్చాడు అనిక్.

కడుపు నిండా తిని…

సామియా పెళ్లికి వెళ్లాడు అనిక్, పెళ్ళిలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నాడు, కడుపు నిండా తిన్నాడు. తర్వాత పెళ్లికి వచ్చిన బంధువులందరికీ సామియాతో తాను చనువుగా దిగిన ఫొటోలను, కొన్ని పామ్ ప్లేట్స్ ను ఇచ్చాడు అనిక్. వాటిని చూడగానే సానియా, అనిక్ లు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో అందరికీ అర్థమైంది. ఆమె పరువు పోవడమే కాకుండా, ఆమె ఎలాంటిదో నలుగురి ముందు నిరూపించాడు. ఇలా చేస్తే అమ్మాయి జీవితం ఏమవుతుంది అని కొందరు అంటే, జీవితం అంటే అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకి కూడా ఉంటుంది, అనిక్ కరెక్ట్ పని చేసాడు అని మరికొందరు అంటున్నారు. మొత్తానికి అనిక్ సామియా పైన ప్రతీకారం తీర్చుకున్నాడు.

 

Comments

comments

Share this post

scroll to top