న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టింది… నా కూతురు అని చెప్పుకొని తల్లిదండ్రులు గ‌ర్వప‌డేలా చేసింది.

పేదరికం ,రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి,ఉండడానికి కనీసం సరైన ఇల్లు లేదు..ఇవేవి తన ఆశయసాధనకు అడ్డు కాలేదు..మన పరిస్థితే అంతంత మాత్రం ఆడపిల్లకు చదువులెందుకని  అమ్మానాన్నలు చిన్నచూపు చూడలేదు… కాబట్టే మనం ఒక SI ని చూస్తున్నాం…కృషి ఉంటే దేన్నైనా సాధించొచ్చని నిరూపించింది అవనిగడ్డకు చెందిన రేవతి..

రేవతి ది అవనిగడ్డ మండలం మోదుముడి… అమ్మా,నాన్నా  లక్ష్మి ,మత్తి వెంకటేశ్వరరావు కూలీలు… గ్రామంలో పోరంబోకు స్థలంలో శిథిలమైన గోడలు, కూలెందుకు సిద్ధంగా ఉన్న ఇంటిలో నివాసం ఉంటున్నారు. రేవతి కి  నాగరేణుక శ్రీనివాసరావు అన్నయ్య ఉన్నడు…  7వ తరగతి వరకు ఊర్లోనే చదువుకున్న రేవతి హైస్కూల్ చదువుతో పాటు ఇంటర్ ,డిగ్రీ అవని గడ్డలో చదువుకుంది. BSC చదివిన రేవతికి చిన్నప్పటి నుండి SI కావాలనే కోరిక ఉండేది. తన ఆశయాన్ని సాధించేందుకు ఏడాది నుండి ఆమె ఎంతో కష్టపడి రోజుకు 2 గంటలు ఫిజికల్ ఎక్సర్సైజ్ లు చేసేది. అవనిగడ్డ లోని ఓఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొందిన రేవతి తొలి ప్రయత్నంలోనే 400 కు 206 మార్కులు సాధించి ఓపెన్ కేటగిరి లో SI పోస్ట్ కి ఎంపిక అయ్యింది.రేవతి అన్న శ్రీనివాసరావు కూడా ఇదే ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొంది LIC AO గా ఉద్యోగం సాధించి ప్రస్తుతం కలకత్తా లో శిక్షణ పొందుతున్నాడు.

ఆడపిల్లకు చదువులెందుకు అని అనుకునే మన సమాజంలో ..పేదరికం తో  బాదపడ్తున్నా కూడా రేవతి అమ్మానాన్నా తన చదువు మాన్పించలేదు .. వాళ్లకు ఏ ఒక్క క్షణం అలాంటి ఆలోచన వచ్చినా మనం ఈ రోజు తన గురించి ఇలా మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదు.

Comments

comments

Share this post

scroll to top