రేవంత్ స్టీఫెన్ సన్ కు థ్యాంక్స్ చెప్పాలంట!?

సోషల్ మీడియాలో కొత్త ప్రచారం తెర మీదకు వచ్చింది. ఓటుకు నోటు విషయంలో రేవంత్ ను అడ్డంగా ఇరికించిన స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి థాంక్స్ చెప్పాలంట!!! తెలంగాణ లో టాప్ లీడర్ గా ఉన్న తనను ఓటు కు నోటు మ్యాటర్ లో రెడ్ హ్యండెడ్ గా పట్టించి, ఏకంగా చంద్రబాబు ఆడియో టేపులను కూడా  ఈ కేసులోకి లాగి, తనను చర్లపల్లి జైలు కు పంపించిన స్టీఫెన్ సన్ కు  రేవంత్ థాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆరా తీస్తే, ఔరా అనే ఆన్సర్లు చెబుతున్నారు, సోషల్ మీడియా సమాజం.

AP-CM-with-Reventh-reddy

కూతురు పెళ్లి ఘనంగా చేయాలనేది ప్రతి తండ్రి కోరిక, అలాంటిది నిశ్చితార్థాన్నే అంగరంగ వైభవంగా చేయగలిగాడు రేవంత్. సిఎం కూతురి పెళ్లికి కూడా దొరకని లైవ్ కవరేజ్ తన కూతురి ఎంగేజ్ మెంట్ కు దొరికింది. నిజం చెప్పాలంటే మంచు మనోజ్ మ్యారేజ్ కంటే ఎక్కువ లైవ్ కవరేజ్ రేవంత్ కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థానికి లభించింది. ముఖ్యంగా మూడు ఛానల్లు  నిశ్చితార్థ వేడుకలు  ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల రూపంలో అందిచాయి.

revanth-doughter-naimisha-engagement

ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం 4 వరకు  ప్రతి బులిటెన్ లో  రేవంత్ కూతురి నిశ్చితార్థ వేడుక ముచ్చట్లే ముచ్చట్లు, ఏ ఛానల్ మార్చినా నైమిషా నిశ్చితార్థ ముచ్చట్లే. కోట్లు పెట్టినా దొరకని లైవ్ కవరేజ్ ఫ్రిీ గా దొరికిందంటే అది స్టీఫెన్ సన్ సలవే అంటున్నారు నెటీజన్లు. అందుకే రేవంత్ స్టీఫెన్ సన్ కు థాంక్స్ చెప్పాలంట..  రేపు న్యూస్ పేపర్ల కవరేజ్ అధనంగా ఉండనే ఉంటుంది.

మరింత సమాచారం కొరకు: CLICK

Comments

comments

Share this post

scroll to top