ఫ్లెక్సీల గొడవ నిన్నా మొన్నటి వరకు సినిమా అభిమానుల మద్య ఉండేది . ఇప్పుడు ఏకంగా రాజకీయాలకు కూడా పాకింది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రతిపక్షనేత రేవంత్ రెడ్డికి మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని అందరికీ తెలుసు.. అలాంటి సంధర్భంలో కెసిఆర్ సొంతూరు గజ్వేల్ లో రేవంత్ ఫోటో తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. ఆ ఫ్లెక్సీ మీద తాటికాయంత అక్షరాలతో ఆటమొదలైంది అంటూ రాసి ఉంది.
వాస్తవానికి నోటు కు ఓటు కేసులో బెయిల్ పై బయటికి వచ్చిన రేవంత్ కూడా ఇప్పుడే ఆట మొదలైంది. కెసిఆర్ ను విడిచిపెట్టేదే లేదు అంటూ సవాల్ విసిరారు. కట్ చేస్తే మళ్లీ ఇప్పుడు సిఎం సొంతూరు గజ్వేల్ లో రేవంత్ ఫోటో తో ఆ ఫ్లెక్సీ ఉండడం కాస్త టెంక్షన్ కు గురి చేస్తోంది ఈ ఫ్లెక్సీ.. రేవంత్ కు తెలిసే ఏర్పాటైందా, లేక అభిమానులు వారికి వారే అనుకుని పెట్టారా అన్నది తెలియదు .దీంతో తెరాస కార్యకర్తలు కూడా దీనికి పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో బిజీ గా ఉన్నారట!
click: వధువును న్యూడ్ సెల్ఫీ కోరిన వరుడు, రద్దయిన పెళ్ళి.