రేవంత్ ఇరికాడా ? ఇరిక్కించారా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే కు 50 లక్షలు లంచం ఇస్తూ ఎసిబి అధికారులకు రెడ్ హాండెడ్ గా పట్టుపడ్డాడు టిటిడిపి నేత రేవంత్ రెడ్డి. డీల్ లో భాగంగా మొత్తం 5 కోట్లు ఇస్తానని అడ్వాన్స్ గా 50లక్షలు ఇస్తున్నాని, మిగితావి తర్వాత ఇస్తానని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టిఫెన్ తో చెప్పినట్లు వీడియో లో రికార్డ్ అయ్యిఉంది.

revanth reddy

వీడియో ఆధారంగా స్టీఫెన్తో రేవంత్ మాటలు:

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేంద్ర రెడ్డిని కూడా నేనే ఎంపిక చేశాను,మీకు రాజకీయంగా ఏలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం, ఒకవేళ మీకు సమస్య వస్తే.. ఏపీలో అవకాశం ఇప్పిస్తాను అయితే ఏపీ అసెంబ్లీ కూడా హైదరాబాద్లోనే ఉంది కనుక 10 ఏళ్లు ఇక్కడే ఉంటుందని చెప్పుకోచ్చారు. 6 నెలల్లో పార్టీ ప్రెసిడెంట్ అవుతా.. మీకు ఎలాంటి ఢోకా ఉండదు. అందులోనూ జానారెడ్డి పనైపోయింది.. జైపాల్ రెడ్డి కూడా నాకు బంధువు అని అన్నారు.

కావాలనే ఇరికించారు ఇది రేవంత్ అండ్ టిడిపి నేతల రివర్స్ ఎటాక్:

నేను ఎవరి ద్వారా మధ్యవర్తిత్వం జరపలేదు, ఎవరికీ తాను డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, కేవలం స్నేహితుడిని కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్లాను. ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం కేసీఆర్‌ ఇంతటి నీచానికి దిగజారుతారని అనుకోలేదు- రేవంత్.

ఏసిబి అధికారులు కార్ లో తీసుకెళ్తున్న సమయం లో రేవంత్  కార్ బయటకు వచ్చి కేసిఆర్ బట్టలూడదీసి కొడతా అంటూ మీసం మెలేశారు.

రేవంత్ అరెస్ట్ ఆ పార్టీ నేతలు ఖండించారు. కుట్రపూరితంగానే రేవంత్ ను ఇరికించారని అన్నారు.

 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top