మావారు దూకుడు పెంచుతారు, బెయిల్ పై రేవంత్ భార్య రియాక్షన్!

ఓటుకు నోటు కేసులో రేవంత్ బెయిల్  కు దొరకగానే దీనిపై ఆయన సతీమణి గీత స్పందించారు. ఇప్పటి నుండి ప్రజా సమస్యలపై  మా వారు మరింత దూకుడు పెంచుతారని ఆమె అన్నారు. రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని తెలుసు, వాటిని ఎదుర్కోడానికి సిధ్దంగా ఉన్నాం కానీ ఇలా వ్యక్తిగత ఇబ్బందులు వస్తాయని ఊహించలేదని ఆమె అన్నారు.

కూతురి నిశ్చితార్థం రోజు చాలా బాధపడ్డామని ఆమె తెలిపారు, 23 యేళ్ల వైవాహిక జీవితం లో ఇన్ని రోజులు తమకు దూరంగా రేవంత్ లేడని ఆమె గుర్తుచేసుకున్నారు. మనిషి దూకుడుగా కనిపించినప్పటికీ , రేవంత్ సున్నిత మనుసు గలవాడని గీత అన్నారు. కష్ట కాలంలో తమకు అండగా నిలబడిన అందరికి ఆమె కృతజ్ణతలు తెలిపారు.  రేవంత్ కు బెయిల్ రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు.

CLICK:  పవన్ ఇంటి ముందు నిరసనకు రెడీ అవుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top