రేవంత్ ను మానసికంగా వేధిస్తున్నారా.?

రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు మానసికంగా వేధిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది ఆరోపించారు. రాత్రాంత రేవంత్‌ను నిద్రపోనివ్వలేదని, ముఖం కడుక్కోడానికి కూడా అనుమతించడంలేదని అన్నారు. రేవంత్‌ను ప్రశ్నలపేరుతో వేధించవద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా వాటిని పోలీసులు పట్టించుకోవడంలేదని న్యాయవాది ప్రమోద్‌రెడ్డి తెలిపారు.

రేవంత్ కేసులో కోర్టు ఇచ్చిన గైడెన్స్:

  • ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిందితులను ఏసిబి విచారణ చేయాలి.
  • అది కూడా న్యాయవాదుల సమక్షంలోనే.
  • థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.

revanth-in-jail

సోమిరెడ్డి హెచ్చరిక:

రేవంత్ రెడ్డికి హాని జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని  తెలుగుదేశం పార్టీ నేత  చంద్రమోహన్ రెడ్డి  ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రేవంత్ కేసులో అటు ప్రభుత్వం ఇటు టిడిపి పార్టీ లమధ్య మాటల యుద్దం నడుస్తోంది.  పూర్తి ఆధారలతో చంద్రబాబు ను కౌంటర్ చేయాలని ప్రభుత్వం చూస్తుంటే, టిడిపి నేతలు మాత్రం ప్రభుత్వం పై రివర్స్ అటాక్ చేస్తున్నారు.

రేవంత్ రియాక్షన్:

‘చెప్పాలింది ఆనాడే చెప్పేశా, ఇప్పుడేమి చెప్పమంటారు. కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు.  చెప్పాల్సిందంతా ఆరోజే చెప్పాను. చెప్పేదేమీ లేదు’ అని టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసిబి విచారణలో పేర్కొన్నారు.

revanth-reddy-bail-petition-off

రేవంత్ భార్య ఆరోపణ:

 

రేవంత్ కేసు విషయంలో రేవంత్ భార్య  తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తన భర్తపై కక్షగట్టారని ఆరోపించారు నా భర్తంటే కెసిఆర్‌కు గుండెల్లో దడ కాబట్టే అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారని ఆమె అన్నారు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top