కూతురి నిశ్చితార్థ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి బిజీబిజీ.

ఓటు కు నోటు విషయంలో రిమాండ్ లో ఉండి  నిన్నే బెయిల్ మీద బయటికి   వచ్చిన రేవంత్ రెడ్డి తన కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థ కార్యక్రమంలో బిజీ బిజీగా గడుపుతున్నాడు. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో జరుగుతున్న  ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు లోకేష్ కూడా హజరు కానున్నారు. కూతురు నిశ్చితార్థం  కోసం  మానవతా దృక్పథంతో ఏసిబి కోర్టు  రేవంత్ కు తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే.

revanth doughter engagement

రేవంత్ వెంట సివిల్ డ్రస్ లో ఏసిబి అధికారులు అతనిని ఫాలో అవుతున్నారు. కోర్టు రేవంత్ కు  షరతులతో కూడిన  బెయిల్ ను మంజూరు చేసింది. ఈ షరతుల ప్రకారం రేవంత్ ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు బెయిల్  అనుమతి, దీనితో పాటు  ఫోన్ మాట్లాడడం. ఏకాంత భేటీలు, రాజకీయ సమావేశాలు నిర్వహించడం, పాల్గొనడం నిషేధం.. దీనిని పరిరక్షించేందుకు రేవంత్  వెంట ఏసిబి అధికారులు సివిల్ డ్రస్ లో రేవంత్  ఫాలో అవుతున్నారు. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ శ్రేణులు, ప్రముఖులు  ఈ కార్యక్రమానికి హజరయ్యారు. డిల్లీ పర్యటన లో బిజీగా గడుపుతున్న చంద్రబాబు సైతం తన కార్యక్రమాలను పక్కన పెట్టుకొని ఈ కార్యక్రమాని హాజరై మళ్లీ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top