రేవంత్ కేసులో పాత్రధారి ఎవరు? సూత్రధారి ఎవరు?

ఒక ఓటు 5 కోట్ల మ్యాటర్ ను తెలంగాణ సియం అంత తేలికగా తీసుకునేలా కనిపించడం లేదు. దొరికినంత వరకు తీగ లాగి డొంక  కదిలించాలని చూస్తున్నారు. రెడ్ హ్యాండెండ్ గా దొరికింది రేవంత్ అయినా, అసలు లింకు  ఎక్కడుంది అనే యాంగిల్ లో దర్యాప్తు దగ్గరుండి మరీ గట్టిగా చేయిస్తున్నట్టు తెలుస్తోంది.

babu revanth

గురువారం  కెసిఈర్ తో రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజి శివధర్ రెడ్డి,  ఏసిబి డిజి ఏకే ఖాన్ లు  సియం  క్యాంప్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టీపెన్ సన్  ఓటు కు నోట్ ను ఆఫర్ చేస్తూ దొరికిన రేవంత్  పై చర్చించారు.  బెయిల్ కోసం రేవంత్ తరఫు లాయర్లు ఎంతగా ప్రయత్నిస్తున్నారో, దానికి రెట్టింపుగా మరిన్ని సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టే పనిలో ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. వీరి  ముగ్గురి చర్చలో  చంద్రబాబు పేరు కూడా బయటికివచ్చినట్టు సమాచారం అందుతోంది.

babu revanth

 

ఈ వ్యవహారంలో పాత్రధారి రేవంత్ అయినప్పటికీ, సూత్రధారిగా చంద్రబాబు ఉన్నాడని మీటింగ్ లో  చర్చించినట్టు  సమాచారం.బుదవారం  వరంగల్ ల్లో హోమంత్రి నాయిని,  స్టీఫెన్ తో చంద్రబాబు మాట్లాడిన టేప్ లు మా దగ్గర ఉన్నాయన్న  మాటలు దీనికి బలాన్ని చేకూర్చుతున్నాయ్.

దొరికిన ప్రతి ఛాన్స్ ను రెండు చేతులతో  ఒడిసి పట్టుకోవాలని  తెలంగాణ సర్కార్ చూస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ స్టీఫెన్ తో  మాట్లాడుతూ పదే పదే బాస్.. బాస్ అంటూ ప్రస్తావించారు.. దీనిని కూడా ఓ ఆధారంగా చేసుకున్నట్టు తెలుస్తోంది.రేవంత్ ఎపిసోడ్ కు ఎక్కడ ఎండ్ కార్డ్ పడుతోంది.  ఎండ్ వరకు ఎన్ని ట్విస్టులుంటాయ్ అన్నది వేచి చూడాలి.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top