పాఠశాల నిర్మాణం కోసం ప్రభుత్వానికి భూమిని విరాళంగా ఇచ్చిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు…

Siva Kumar

ఇతరుల కోసం ఏదైనా చేయాలనే తపన మనలో ఎంత మందికి ఉంటుంది? చాలా తక్కువ మందికే ఉంటుందని మీరు చెప్పవచ్చు. అయితే అది నిజమే! కానీ ఎంత తక్కువ మంది సహాయం చేసినా వారు చేసే సహాయం అధిక శాతం మందికి ఉపయోగపడితే..? అంతకు మించిన సహాయం ఇంకేముంటుంది! సరిగ్గా ఇలాగే చేశాడతను.

అది మహారాష్ట్రలోని గోండ్వానా ప్రాంతం. ఆ ప్రాంతం వారు ఒకప్పుడు తమ ఉనికి కోసం పోరాడారు. ఆ సందర్భంలో ఎంతో విలువైన తమ ప్రాణాలను, ఆస్తులను, భూములను కోల్పోయారు. ఒకప్పటి చేదు సంఘటనల ప్రభావాన్ని ఇప్పటికీ ఆ ప్రాంతంలో అధిక శాతం మంది అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తమ ప్రాంతీయుల కోసం ఏదైనా చేయాలని అనుకున్నాడు. అయితే అప్పటికే అతను తన ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్ అయ్యాడు. దీంతో తాను అనుకున్న పని చేసేందుకు ఎలాంటి అడ్డంకి రాలేదు.

retired-school-teacher

తన తాత ముత్తాతల నుంచి సంక్రమించిన కొద్దిపాటి భూమిని అతను ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చాడు. దీంతో అక్కడ ఓ పాఠశాల నిర్మాణం ప్రారంభమైంది. దాన్ని చూస్తే అతను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఫీలవుతాడు. ఎందుకంటే కనీస సదుపాయాలు కూడా లేని తమ ప్రాంతంలో తన వంతు బాధ్యతగా నిర్మిస్తున్న ఆ పాఠశాలలో పిల్లలకు నాణ్యమైన విద్య దొరకనుండడమే.

జీవితమంటే ఎల్లప్పుడూ తన కోసం తాను బతికే స్వార్థపూరితమైంది కాదని, ఇతరుల కోసం బతికినప్పుడే ఆ జీవితానికి ఓ అర్థం ఉంటుందని అతను చెబుతాడు. మనం సంపాదించని ఆస్తి మనకెంత ఉన్నా అది ఇతరులకు ఉపయోగపడితేనే దానికి సరైన విలువ చేకూరుతుందని అంటాడు. నిజమే మరి! తోటి వారికి సహాయం చేయడంలో కలిగే సంతోషం ఎంతో వెలకట్టలేనిది. దాన్ని స్వయంగా అనుభవించాల్సిందే తప్ప, ఎంత ధనం ఇచ్చినా కొనుగోలు చేయలేం కదా!

Comments

comments