కూల్‌డ్రింక్ ను రూ.4 ఎక్కువ‌కు విక్ర‌యించార‌ని ప్ర‌ముఖ రెస్టారెంట్‌కు రూ.10వేల ఫైన్‌..!

వాట‌ర్ బాటిల్స్‌, కూల్ డ్రింక్స్, తిను బండారాలు… ఇలా ఇవే కాదు, ఏ వ‌స్తువునైనా, ప్యాక్డ్ ఫుడ్‌నైనా ఎంఆర్‌పీ క‌న్నా ఎక్కువకు అమ్మితే చర్య‌లు తీసుకుంటామ‌ని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గ‌తంలో చెప్పిన విష‌యం విదిత‌మే. అయిన‌ప్ప‌టికీ దేశంలో చాలా చోట్ల ఆయా వ‌స్తువుల‌ను ఇప్ప‌టికీ ఎంఆర్‌పీ క‌న్నా ఎక్కువ ధ‌ర‌కు విక్ర‌యిస్తూనే ఉన్నారు. అయితే అలాంటి వ్యాపారుల‌పై కేవ‌లం కొంద‌రు మాత్రమే ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా మ‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోనే ఓ ప్ర‌ముఖ రెస్టారెంట్‌పై ఓ సామాజిక వేత్త ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన అధికారులు ఆ రెస్టారెంట్‌కు ఫైన్ వేశారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో షా గౌస్ రెస్టారెంట్ అంటే చాలా మందికి తెలుసు. ఆ రెస్టారెంట్‌కు ఉన్న ఓ శాఖ‌లో విజ‌య్ గోపాల్ అనే సామాజిక వేత్త ఓ సారి సాఫ్ట్ డ్రింక్ తాగారు. అయితే అందుకు గాను రూ.4 చార్జి ఎక్కువ వేశారు. ఎంఆర్‌పీ ధ‌ర క‌న్నా ఎక్కువ ధ‌ర వేసినందుకు గాను ఆ రెస్టారెంట్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లీగ‌ర్ మెట‌రాల‌జీ డిపార్ట్‌మెంట్‌కు ఆయ‌న ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు ఆ రెస్టారెంట్‌పై రూ.10వేల ఫైన్ వేశారు.

అయితే సాధారణంగా ఇలాంటి కేసుల్లో రూ.25వేల వ‌రకు ఫైన్ ప‌డుతుంద‌ని, కానీ షా గౌస్ లాంటి పెద్ద రెస్టారెంట్‌కు కేవ‌లం రూ.10వేలు ఫైన్ ప‌డ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు. అయినా ఇక‌పై ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ను అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌న‌ని ఇక‌పై ఇలాంటి ఫిర్యాదుల‌తోపాటు స‌ద‌రు రెస్టారెంట్ల‌పై 420 కేసు కూడా పెడ‌తాన‌ని అంటున్నాడు విజ‌య్‌. అవును మ‌రి. ఎవ‌రైనా ఆ కేసు పెట్ట‌వ‌చ్చు. ఎందుకంటే చ‌ట్టంలో కూడా ఆ వెసులు బాటును వినియోగ‌దారుల‌కు క‌ల్పించారు. వ్యాపారులు ఎవ‌రైనా ఎంఆర్‌పీ క‌న్నా ఎక్కువ ధ‌ర‌కు విక్ర‌యిస్తే చీటింగ్ చేసిన‌ట్టే అవుతుందట‌. చ‌ట్టంలో అలాగే ఉంది. అందుకే విజ‌య్ కూడా 420 కేసు న‌మోదు చేస్తాన‌ని అంటున్నాడు. నిజంగా ఇలా వారు ఉండాల్సిందే. అప్పుడు గానీ అలాంటి రెస్టారెంట్ల దోపిడీ ఆగ‌దు. ఆయ‌నే కాదు, మ‌నలో ఎవ‌రికి ఇలా జ‌రిగినా మ‌నం కూడా అలా కేసులు పెట్టాల్సిందే. ఫిర్యాదులు చేయాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top