రేణు దేశాయ్ మరో సంచలన నిర్ణయం! పవన్ ఫాన్స్ కి మరింత దూరం అవుతున్న రేణు ఎలాగో తెలుసా..?

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తీవ్రమైన నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటి వరకు తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉన్న ఆమె ఇక నుంచి ట్విట్టర్ ఖాతా నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకొన్నారు. తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించిన వెంటనే కొందరు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు రేణు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాను ఎందుకు ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నారో వివరణ ఇచ్చారు.

చాలా ప్రతికూలత
ట్విట్టర్‌లో చాలా ప్రతికూలత
ట్విట్టర్‌లో చాలా ప్రతికూలత ఉందని నేను భావిస్తున్నాను. వ్యక్తిగతం, ప్రొఫెషనల్‌గా చిరాకుతో ఉండే వారు లేదా చాలా మంది తమ పేర్లతో కాకుండా ఫేక్ అకౌంట్లతో ఉన్నారు. అలాంటి వారికి రాజకీయ నేతలు, సినీ ప్రముఖులపై చాలా నెగిటివిటితో రాయడానికి ప్రయత్నించే వాళ్లు ఉన్నారు. అని రేణు ట్విట్టర్‌లో ఓ ప్రకటన చేశారు.

ట్విట్టర్ డీ ఆక్టివేట్
ట్విట్టర్ డీ యాక్టివేట్

నేను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. అందుకే ఈ ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నాను. ఈ నేపథ్యంలో నా ట్విట్టర్ అకౌంట్‌ నుంచి వైదొలగాలని (డీ యాక్టివేట్) నిర్ణయం తీసుకొన్నాను. ట్విట్టర్‌కు దూరంగా ఉంటాను అని రేణుదేశాయ్ తెలిపారు.
తోడుగా నిలిచిన వారికి థ్యాంక్స్
తోడుగా నిలిచిన వారికి

నా జీవితం ప్రతికూల పరిస్థితుల్లో పడి ఆందోళనలో పడినప్పుడు వెంటగా, తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. ట్విట్టర్‌లో నిజాయితీ కలిగిన వ్యక్తులకు నా థ్యాంక్స్ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
రెండో పెళ్లిపై మిశ్రమంగా
రెండో పెళ్లిపై మిశ్రమ స్పందన

పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ ఆరేళ్ల క్రితం అధికారికంగా విడాకుల తీసుకొన్నారు. చాలా రోజులుగా పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్నారు. తాజా సినీ పరిశ్రమకు చెందని వ్యక్తితో ఆదివారం పుణెలో నిశ్చితార్థం జరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది.

Comments

comments

Share this post

scroll to top