ఆ పాస్ పోర్ట్ లు ఇక చెల్లవ్… రెన్యువల్ చేయించుకోవాల్సిందే.

అధికారులు ఎప్పుడు ఎలాంటి నిమయ నిబంధనలు పెడతారో చెప్పటం చాలా కష్టం. తాజాగా ఓ కొత్త మార్పును ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్స్  (ఐసిఏఓ) తీసుకువచ్చింది. విదేశాలకు బయలుదేరుతున్న వారు ఒక్కసారి తమ పాస్ పోర్ట్ లు చెక్ చేసుకోవాలని, 2001 ముందు  వచ్చిన పాస్ పోర్ట్ లన్నీ చేతిరాత ద్వారా నమోదుచేసుకున్నవేనని, ఇప్పుడు వాటిని రిన్యువల్  చేసుకోవలసిందిగా ఆదేశించింది. రాత పూర్వకంగా నమోదైన పాస్ పోర్ట్ రిన్యువల్ చేసుకొని పక్షంలో వీసా ,సమస్యలు ఎదుర్కోక తప్పదు.

ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్స్  (ఐసిఏఓ) లో భారతదేశం కూడా సభ్యత్వం ఉన్న దేశం. ఇందులో సభ్యత్వం ఉన్న ఏ దేశానికి చేతిరాతతో ఉన్నటువంటి పాస్ పోర్ట్ హోల్డర్స్ ఇక నుండి వీసా పొందలేరు. చేతి రాతతో రాసిన పాస్ పోర్ట్ లకు ఈరోజే (నవంబర్ 25) ఆఖరు తేదీ. భారత్ లో 2001 ముందు నుండి వచ్చిన పాస్ పోర్ట్ లన్నీ చేతిరాతతో రాసినవే. వీటి కాలపరిమితి 20 ఏళ్ళు ఉంటుంది, కాబట్టి  ఫారెన్ కు వెళ్ళాలనుకున్న వీసా సదుపాయం పొందాలనుకుంటే వెంటనే ఆ పాస్ పోర్ట్ లను రిన్యువల్ చేసుకోండి.

Comments

comments

Share this post

scroll to top