తన పుస్తకం లో పవన్ ప్రస్తావన గురించి రేను దేశాయ్ క్లారిటీ.?

రేణు దేశాయ్ గారు ఇటీవలే ఒక బుక్ రాసారు, ఆ బుక్ పేరు ‘ఏ లవ్ అన్ కండీషనల్’. ఇందులో 32 కవితలు ఉన్నాయ్. ఈ బుక్ కి మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఒక ఇంటర్వ్యూ లో రేణు దేశాయ్ గారు మాట్లాడుతూ :

50-60 పుస్తకాలు… :

“ఒక 50-60 బుక్స్ అమ్ముడుపోతాయి అనుకున్నా, కానీ ఇంత మంది నా బుక్స్ కొంటారని అస్సలు అనుకోలేదు, ఇంత ఆదరణ చూసి నేనే ఆశ్చర్యపోయా. మొత్తం 250 కవితలు రాసాను, కానీ ఒక పుస్తకం లో అన్ని కవితలు పెడితే ఎవరు చదువుతారు అని అనిపించింది, ఆ తరువాత 100 ఆ తరువాత 50. చివరకు 32 కవితలకు వచ్చా, ఆ 32 కవిత్వాలు కలిగిన పుస్తకం ఏ ఈ ‘ఏ లవ్ అన్ కండీషనల్’.

నా లైఫ్ ఓపెన్ బుక్, ఎందుకంటే నా ఎక్స్-హస్బెండ్.. :

” నేను ప్రేమ మీద డబల్ పీ.హెచ్.డీ చేశాను, మీ అందరికి తెలుసు నా 18 సంవత్సరాల నుండి నా లైఫ్ ఓపెన్ బుక్ ఎందుకంటే, నా ఎక్స్ హస్బెండ్ ఇస్ బిగ్ పర్సనాలిటీ అఫ్ తెలుగు ఇండస్ట్రీ ఇంకో రకంగా చెప్పాలి అంటే మొత్తం తెలుగు ప్రజలందిరికి తెలుసు, ఎందుకంటె ఆయన ఇప్పుడు రాజకీయనేత కాబట్టి. నా జీవితం లో దాగున్న విషయం ఏం లేదు, నేను ఒక హీరోయిన్ కనుక ఇంక దాగలేకపోయింది, నేను తనని ఎలా కలిసాను, తనతో ప్రేమలో ఎలా పడ్డాను, తనతో కలిసి ప్రయాణించింది, అధికారిక పెళ్లి, అనధికారిక పెళ్లి, ఆ తరువాత డివోర్స్, నా లైఫ్ అంత ఒక యాక్షన్ డ్రామా థ్రిల్లర్ మూవీ లా సాగింది, అందువల్ల నాకు చాలా అనుభవం ఉంది ప్రేమ మీద.. పెళ్లి ముందు ఉన్న లవ్, పెళ్లి తరువాత ఉన్న లవ్, పెళ్లి అయిపోయాక లవ్.. నేను అన్ని రకాల ప్రేమలను చూసాను. నాకు ఎక్స్పీరియన్స్ చెయ్యాలని ఉంది ఇప్పుడు ప్రేమని”.

“నేను హాస్పిటల్ లో సంవత్సరం ఉన్నా, అప్పుడు ట్విట్టర్ కి బాగా అలవాటు పడ్డా, అలా ట్విట్టర్ లో కవిత్వాలు రాసి రాసి అలవాటైపోయింది. ఆలా 250 రాసాను, అందులో 32 కవిత్వాలు ఈ పుస్తకం లో ఉన్నాయ్” అని చెప్పారు రేణు దేశాయ్ గారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top