రెండో పెళ్లిపై “రేణు దేశాయ్” సంచలన నిర్ణయం..మొన్నటివరకు ఆలోచన లేదంట కానీ ఇటీవలే ఒక సంఘటన!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. చాన్నాళ్లకు బుల్లితెరమీద నీతొనే డాన్స్  అనే ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ షో ఓపెనింగ్ రోజున రేణు మంచి డాన్స్ పెర్ఫామెన్స్‌తో తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేసింది. అయితే ఈ షోలో కనబడే ముందు ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రేణు దేశాయ్ ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. అస‌లు విష‌యం ఏంటంటే రేణు దేశాయ్ మ‌ళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందట. పవన్‌తో రేణు విడిపోయాక‌ ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.

‘‘ఏడాది క్రితం వరకు నాకు పెళ్లి ఆలోచనే లేదు. కానీ, ఆరోగ్యం బాగాలేనప్పుడు నాకంటూ ఎవరైనా ఉంటే కొంచెం హెల్ప్ అవుతుందనిపించింది. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లడం కానీ, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి మన అనేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుంటుంది. నాకు ఒంట్లో బాగలేకపోతే రెండుమూడు సార్లు మా అక్కవచ్చి ఉదయం 3 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అనిపించింది. నా అనేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుంటుందని. ఆ ఇన్సిడెంట్‌కు ముందు నో మ్యారేజ్.. నో లవ్.. నో రిలేషన్ షిప్.. నోమోర్ అనుకున్నా. కానీ ఒంట్లో బాగాలేనప్పటి నుంచి ఆలోచన మారుతోంది. చూద్దాం ఏదైనా రాసుంటే.. ఎందుకంటే మనకు తెలీదు కదా.. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ప్రస్తుతానికి ఎవరూ లేరు. దేవుడు ఎవరినైనా పంపిస్తే చూద్దాం.’’ అంటూ తన మనసులోని బాధను, భావాన్ని వ్యక్తం చేశారు రేణూ దేశాయ్.

Comments

comments

Share this post

scroll to top