ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన బాధ ను వెళ్ల గక్కింది. పిల్లలున్న మగాళ్లు మళ్లీ పెళ్లి చేసుకున్నా సమస్యేమీ ఉండదు… అదే, పిల్లలున్న మహిళ మళ్లీ వివాహం చేసుకుంటే మాత్రం అదో పెద్ద తప్పు, నిషేధం అన్నట్టు చూస్తారు.బేసిగ్గా తల్లిగా ఉండాలంటే, ఆమె హ్యూమన్ గా ఎమోషన్స్ కలిగి ఉండటం మానేయాలి’ అంటూ ట్వీట్ చేసారు.
ఈ మధ్య ట్విట్టర్ ను అస్త్రంగా చేసుకొని తన మాజీ భర్త పవన్ పై కాస్త సెటైరిక్ గానే పంచులు విసురుతోంది రేణు దేశాయ్.. గతంలో ‘కలవడం వల్ల వచ్చే సంతోషం ఎక్కువా? లేక విడిపోవడం వల్ల కలిగే బాదా? జీవితం అయోమయంగా ఉంది.’ అని వేదాంతం మాట్లాడితే ఇప్పుడు పిల్లలు , సగటు మహిళల జీవనం పై తన ఫీలింగ్ ను తెలిపారు.
పవన్ బిజెపీ కి సపోర్ట్ గా ఉన్నప్పుడు రేణు దేశాయ్ మహారాష్ట్ర సిఎం పడ్నవిస్ కు వ్యతిరేకంగా కూడా ఓ పోస్ట్ ను ట్విట్టర్ లో పెట్టారు.. తాజాగా చేసిన ఈ ట్వీట్ ను పరిశీలనగా చూస్తుంటే పవన్ వరుస పెళ్లిల్లపై స్పందిచారనిపిస్తుందనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుత పవన్ కళ్యాణ్ తో విడిపోయిన రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యాలతో కలిసి ఉంటోంది