పవన్ కళ్యాణ్ పై “మహేష్ కత్తి” సంచలన వాఖ్యలకు “రేణు దేశాయ్” ఏమని స్పందించారో తెలుసా.?

కత్తిమహేశ్ సినిమా క్రిటిక్,బిగ్ బాస్ కంటెస్టెంట్  ..బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయకముందు అతనెవ్వరో చాలా కొద్ది మందికి తెలుసు.బిగ్ బాస్ షో నుండి బయటికి వచ్చాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై పలు విమర్శలు చేసి వార్తల్లో నిలిచాడు..ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ నుండి బెదిరింపులు ఎదుర్కొన్నారు.పవన్ ఫ్యాన్స్ వర్సెస్ కత్తి మహేశ్ వార్ చాలా పెద్దగానే జరిగింది.. ఆ వార్ ముగిసి రెండురోజులు కూడా గడవలేదు మహేష్ మళ్లీ పవన్ విషయంలో తలదూర్చారు.ఈ సారి డైరెక్ట్ గా రేణుదేశాయ్ స్పందించారు..

బెంగుళూరులో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ రెండు రోజుల క్రితం హత్యకు గురైంది. ఈ హత్యను ఖండిస్తూ అనేకమంది ట్వీట్స్ చేశారు. ఈ విషయం గురువారం రాత్రి పవన్ కల్యాణ్ కూడా ట్వీట్ చేశారు. కానీ ఆమె పేరు గౌరీ లంకేశ్ అయితే గౌరీ శంకర్ అని పవన్ ట్వీట్ చేశారు.  దీన్ని గుర్తించిన మహేశ్ కత్తి… హత్యకు గురైన జర్నలిస్ట్ పేరు గౌరీ శంకర్ కాదు గౌరీ లంకేశ్ అని పవన్‌ని హేళన చేశారు.పవన్ కల్యాణ్ కులాలకు, మతాలకు అతీతమైన వ్యక్తి మాత్రమే కాదు, జ్ఞానం లేని వ్యక్తని తనకు ఇప్పుడు అర్థమైందని మహేశ్ కత్తి విమర్శించారు.

కత్తి మహేష్ మాటలపై పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “నాకు కత్తి మహేష్ ఎవరో తెలియదు. ఇలాంటి వ్యక్తులందరూ ఏదో పబ్లిసిటీ కోసమే చీప్ కామెంట్లు చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి పూర్తిగా తెలిసిన వారు తప్పుగా మాట్లాడరు” అని ఘాటుగా స్పందిచింది. కత్తి మహేష్ తీరు చూస్తుంటే.. ఈ వివాదం ఇంతటితో ఆగేలా లేదు.

Comments

comments

Share this post

scroll to top