ఫాన్స్ పై ఫైర్ అవ్వడం కాదంట..! తప్పుగా టెలికాస్ట్ చేస్తున్న మీడియా అంటూ..”రేణు దేశాయ్” సరికొత్త పోటీ.!

మహిళల పట్ల, మహిళలు రెండో వివాహం చేసుకోవడం పట్ల కొందరు సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్లపై నటి, దర్శకురాలు రేణు దేశాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరిగా ఉండటం కష్టమనిపిస్తోందని.. తనను అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే పెళ్లి గురించి ఆలోచిస్తానని ఇటీవల రేణు దేశాయ్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆమె మళ్లీ పెళ్లిచేసుకోవడం అనే విషయాన్ని అసహ్యించుకుంటూ కొందరు అభ్యంతరకర మేసేజ్ లు చేస్తున్నారని రేణు దేశాయ్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తన పిల్లల్ని చూసుకోవడానికి ఓ వ్యక్తి తోడుంటే బాగుంటుందని ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. రెండో పెళ్లికి సిద్ధమయ్యే ఆమె ఆ వ్యాఖ్యలు చేశారని భావించిన పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ కామెంట్లు చేశారు. మరో పెళ్లి చేసుకుంటే మీ గౌరవం తగ్గుతుందని కొందరు, మిమ్మల్ని అసహ్యించుకుంటామని మరికొందరు కామెంట్లు చేశారు. కాగా ఈ కామెంట్లపై ఆవేదన వ్యక్తం చేసిన రేణు దేశాయ్ ఇది తన ఒక్కదానికి ఎదురవుతున్న పరిస్థితి కాదని మహిళలంతా ఎదుర్కొంటున్న పరిస్థితి అంటూ తన స్పందనను తెలియజేసింది.

‘ఈ పోస్ట్ కేవలం నన్ను మాత్రమే ఉద్దేశించింది కాదు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం. ఇలాంటి ఆలోచన తీరున్న మగవాళ్ల మధ్య ఉన్నామని ఆందోళన చెందాల్సి వస్తుంది. సమాజంలో ఓ వైపు మహిళా సమానత, ఆడపిల్లలు శక్తి స్వరూపం, అత్యాచారాల నుంచి మహిళలను కాపాడాలి. వారి భద్రతకు చర్యలు తీసుకోవాలి అంటుంటాం. మరో వైపు ఏడేళ్లు ఒంటరిగా ఉన్న నేను ఇప్పుడు ఒకరి తోడు అవసరమని మాట్లాడితే అసహ్యించుకుంటున్నట్లు సందేశాలు పంపుతున్నారు. మన దేశంలో ఓ మగాడు ఏమైనా చేయొచ్చు. ఎన్నిసార్లయినా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఓ అమ్మాయి మరో బంధం గురించి ఆలోచించడం కూడా తప్పా? జీవితాంతం తప్పు చేశానన్న భావనతో ఏ తోడు లేకుండా బతకాలా? ఇవాళ నేను దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా.. మన దేశంలో అమ్మాయిల భవిష్యత్తు మెరుగ్గా ఉండాలంటే, తల్లులు వాళ్ల కొడుకులను పద్ధతిగా పెంచాలి. అప్పుడైనా మగవాళ్ల ఆలోచనా విధానంలో మార్పు వస్తుందేమో’ అంటూ రేణు దేశాయ్‌ తన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

అలా పోస్ట్ చేసే సరికి..మీడియా వాళ్ళు అంతా…పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి రేణు దేశాయ్ కి మధ్య వార్ అని టెలికాస్ట్ చేసాయి. సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ ఎంతో వైరల్ అయ్యింది. దీని పై స్పందిస్తూ రేణు మరో పోస్ట్ చేసారు. నేను ఫాన్స్ అని ఎక్కడా వ్యక్తపరచలేదు. సమాజంలో ఆడవారికి ఒక రూల్..మగవారికి ఒక రూల్ అని మాత్రమే అన్నాను అని చెప్పారు. తప్పుగా అనుకోకండి, మీడియాని తప్పుగా ప్రచారం చేయకండి అని వ్యక్తం చేసారు పోస్ట్ లో.!

Comments

comments

Share this post

scroll to top