“మది నిండా ఆయనే..!” వీడియోతో సంచలనం సృష్టిస్తున్న “రేణు దేశాయ్”..! ఏడేళ్లుగా ఒంటరిగానే.!

రేణు దేశాయ్… సినినటిగా ప్రయాణం తొలిరోజుల్లోనే సహనటుడితో సహజీవనం పిల్లలు ,విడాకులు..ఒంటరి బతుకు..ఇది ప్రస్థానం..కొన్ని రోజులయ్యాక వెనుకకు తిరిగి చూస్తే ఏముంది తన జీవితంలో అనుకుంటే అయ్యో అని నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేం..విడాకులు అయ్యాక పవన్ వేరే పెళ్లి చేసుకున్నా..రేణు మాత్రం ఏడేళ్లుగా ఒంటరిగానే ఉంటుంది.ఈ మధ్య ఆరోగ్యం బాగోక హాస్పటలైజ్ అయినప్పుడు తన జీవితం గురించి ఆలోచించినప్పటికి పవన్ ఫ్యాన్స్ తో వచ్చిన వ్యతిరేకత మనందరికి తెలిసిందే..ఇప్పుడు రేణు మరోసారి తన గురించి ఆలోచించుకునే ప్రయత్నం చేసింది.అందులో భాగంగానే ఒక వీడియో షేర్ చేసింది.ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియోనే హాట్ టాపిక్…

‘‘నా జ్ఞాప‌కాల‌న్నింటినీ చూసుకుంటున్నాను. ఆయ‌న మాట‌లు, ప‌దాలు, ఆయ‌న పేరు చెక్కిన క‌లం నా జ్ఞాప‌కాల్లో ఉన్నాయి. కానీ క‌మ్ముకున్న హిమం క‌రిగిపోయి మ‌ళ్లీ ఆ జ్ఞాప‌కాలు క‌ళ్లెదుట నిలిచాయి. విధి ఎంత బ‌లీయమైనది. మ‌న‌సు లోతుల్లో పాతుకుపోయిన జ్ఞాప‌కాలన్నింటినీ మ‌ళ్లీ తట్టిలేపింది. ఆ జ్ఞాప‌కాల‌ను ఇప్పుడు తిరిగి చూసుకుంటే తుప్పు ప‌ట్టిన క‌లం, దానిపై రాసుకున్న పేరు తుడిచిపెట్టుకుపోయాయి. ముక్క‌లైన హృద‌యం, నేను రాసుకున్న లేఖల కాగిత‌పు ముక్క‌లు క‌న్పించాయి’’ అంటూ ‘డాలర్- ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్’ అనే టైటిల్‌తో ఉన్న ఈ వీడియోలో జ్ఞాప‌కాల‌ గురించి ఆమె తెలిపిన విధానం గుండెలను పిండేసింది. విడిపోయినప్పటికి,మనిషి మన నుండి శాశ్వతంగా దూరం అయినప్పటకి జ్ణాపకాలెప్పుడు మనల్ని విడిపోవూ..మనం ఉన్నంత వరకు మన వెన్నంటే ఉంటాయి..ఇప్పుడు రేణుని కూడా తన గత బంధపు తాలూకూ జ్ణాపకాలు వీడిపోవట్లేదు అని ఈ వీడియో చూసే ఎవరికైనా అర్దం అవుతుంది.ఆమె తెలిపిన ఈ జ్ఞాప‌కాలన్నీ పవన్ గురించే అని నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు..

watch video here:

Comments

comments

Share this post

scroll to top