రేణుదేశాయ్.. బద్రి సినిమాతో టాలివుడ్లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులనుండి మంచి మార్కులు కొట్టేసింది.అంతేకాదు ఆ సినిమాతో ఏకంగా పవన్ మనసులో చోటు సంపాదించింది.అప్పటికే పవన్ కి పెళ్లి అయింది.అయినప్పటీకీ కూడా రేణు పవన్ తో రిలేషన్ కంటిన్యూ చేసింది. పవన్ తో సహజీవనం ద్వారా ఇద్దరు పిల్లలు పుట్టాక పవన్,రేణు వివాహం చేసుకున్నారు.వారిద్దరి మధ్యా ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ ఇద్దరు పిల్లల తర్వాత విడిపోయారు.ఏడేళ్లుగా వేరుగా ఉంటున్నా రేణు ఈ మధ్య తరచూ వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నారు..మరోవివాహం వైపు ఆసక్తి ఉన్నట్టు మాట్లాడిన రేణు,పవన్ స్టైల్ గురించి భావోద్వేగంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరి చర్చకు వచ్చాయి.
రేణు తో విడాకుల తర్వాత పవన్ అన్నా లెజోనెవా ని వేరే వివాహం చేసుకున్నారు.వీరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు,రేణు మాత్రం ఏడేళ్లుగా ఒంటరిగానే ఉంటుంది .తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ మరో వివాహం చేసుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించారు. ఏడాది క్రితం వరకు తనకు పెళ్లి ఆలోచన లేదన్నారు. కానీ తాను అనారోగ్యానికి గురైనప్పుడు తనకంటూ ఒకరు ఉంటే బాగుంటుందనిపిస్తోందంది..దానిపై పవన్ ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలంలా లేచారు.ఐ హేట్ యూ అంటూ,మీరే మాకు వదిన,వేరే వివాహం ఆలోచన తీసేయాలంటూ రకరకాలుగా సోషల్ మీడియా వేదికగా మెసేజ్ లు చేసారు..అది వేరే విషయం..కానీ రేణు మనసులో పవన్ ఇంకా ఉన్నాడా అనే ఆలోచన కలుగుతుంది..
ఇటీవల రేణు నీతోనే డ్యాన్స్ ప్రొగ్రాం కి జడ్జ్ గా వ్యవహరిస్తుంది.ఆ ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ సాంగ్ పై డ్యాన్స్ చేసిన కంటెస్టెంట్ కి మార్క్స్ ఇచ్చిన టైంలో రేణు పవన్ ని తలుచుకున్నారు..అంతే కాదు పవన్ స్టైల్ ని తనే చేసి చూపించి,పవన్ చేసేదాంట్లో మీరు చేసింది పది శాతం కూడా కాదు అంటూ కామెంట్స్ చేసింది.కామెంట్ చేయడం విషయం కాదు..బట్ ఆ టైంలో తను ఉద్విగ్నతకి లోను కావడం,గత జ్ణాపకల్లోకి వెళ్లినట్టుగా అనిపించడం,ఇంకా తన మనసులో పవన్ ఉన్నాడనే ఆలోచనలు కలిగిస్తున్నాయి.ఎంతైనా భార్యాభర్తలు కొన్నేళ్లపాటు కలిసి బతికారు..విడిపోయినప్పటికీ జ్ణాపకాలు వెంటాడుతూనే ఉంటాయి..