అడగడానికి నోరెలా వచ్చింది..? ఆ రెండు ప్రశ్నలపై శ్రీయ సీరియస్.! ఇంతకీ ఏం అడిగారు..?

శ్రీయ … దశాబ్దం పైగా వెండితెరని ఏలుతున్న స్టార్ హీరోయిన్..చిరంజీవి,బాలక్రిష్ణ,వెంకటేశ్,నాగార్జున లాంటి టాప్ హీరోల సరసన నటించింది ..ఉదయ్ కిరణ్,ప్రభాస్ లాంటి నేటి తరం హీరోలతో పక్కన కూడా నటించింది.ఇప్పుడు మంచు విష్ణు తో గాయిత్రి అనే సినిమాలో పల్లెటూరి పిల్లగా నటిస్తుంది..ఒకటి రెండు సినిమాలతో పెట్టెబేడా సర్దేసే హీరోయిన్లుండే మన ఇండస్ట్రీలో ఇన్నేళ్లు కంటిన్యూ అవడం అంటే మామూలు విషయం కాదు..అయితే శ్రీయకు ఈ మధ్య కోపం వచ్చింది.మీడియా అడిగే రెండు ప్రశ్నలు తనకు బాగా కోపం తెప్పించి కాస్తా ఘాటుగానే సమాధానం ఇచ్చింది..

ఒకప్పుడు శ్రీదేవి ఈ విధంగా రెండు తరాల నటులతో నటించింది.ఆ తర్వాత మళ్లీ అలా నటించింది శ్రీయనే… శ్రీదేవి ,శ్రేయ పోలిక అతిశయోక్తి అనిపించినప్పటికీ తప్పదు..అయితే  దర్శకులు, రచయితలు తన కోసం కొత్త పాత్రలను సృష్టిస్తున్నారని, అవి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుండటం,ప్రజలు ఆదరించడం వలనే ఇన్నేళ్లు ఉండగలిగాను అని చెప్పే శ్రీయకి కోపం తెప్పించిన రెండు విషయాలు ఏంటంటే..

ఇండస్ట్రీలో ఇంత లాంగ్ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తుండటంతో.. ఎక్కడికెళ్లినా ఇదే ప్రశ్న ఎదురవుతోందట. మీడియా కంటపడితే చాలు ఇదే ప్రశ్న అడిగి విసిగిస్తున్నారట. సున్నితంగా చెప్తే కుదరదని కాస్త ఘాటుగానే హెచ్చరించింది.

‘హాలీవుడ్ నటీమణులు 60 ఏళ్ల వరకు నటిస్తున్నారు, అలాంటిది నాకు ఆఫర్లు రావడంలో పెద్ద ఆశ్చర్యమేముంది. అసలు ఇలాంటి ప్రశ్నలు అడగడానికి మీడియాకు నోరెలా వస్తుంది’. అని శ్రీయ ఫైర్ అయ్యింది.. అలాగే మీరెలాంటి పెళ్లిని ఇష్టపడుతారు అన్న ప్రశ్నకు… ‘అది మీకు సంబంధం లేని విషయం.. అంతవరకు చెప్పగలను’ అని ఘాటుగా బదులిచ్చింది శ్రీయ.

గాయిత్రి ట్రైలర్,పాటలు చూస్తుంటే ఆ సినిమా బాగుండేలానే ఉంది.. అందు’లో శ్రీయ పాత్రకు మంచి మార్కులు పడితే.. ఆమెకు మరిన్ని అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం.అప్పుడు మన మీడియా మళ్లీ ఇవే ప్రశ్నలడిగితే ఈ సారి ఇంకెంత ఘాటుగా సమాధానం చెప్తుందో..

Comments

comments

Share this post

scroll to top