ఆధార్ కార్డుతో మొబైల్ నంబ‌ర్ ను లింక్ చేయ‌డం ఇప్పుడు ఇంట్లో నుండే చేయొచ్చు..! ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి!

మ‌న దేశంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రు త‌మ త‌మ మొబైల్ నంబ‌ర్ల‌ను ఆధార్ కార్డుల‌కు లింక్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి అయింది. మొబైల్ నంబ‌ర్ ను ఆధార్ తో లింక్ చేయ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలుంటాయి. ఇన్ క‌మ్ టాక్స్ రిట‌ర్న్స్ ను ఆధార్ నెంబర్ ద్వారా ఈ వెరిఫై చేసుకోవ‌చ్చు. ఆన్ లైన్ లో ఈ ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. ఆన్ లైన్ లో ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవ‌చ్చు. ఇలా అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాలను ఆధార్ తో ఫోన్ నంబ‌ర్ ను లింక్ చేయ‌డం ద్వారా పొంద‌వ‌చ్చు. అయితే ఇందులో రెండు ర‌కాలు ఉన్నాయి. ఒక‌టి.. ఫ‌స్ట్ టైమ్ మొబైల్ నంబ‌ర్ ను ఆధార్ కు లింక్ చేయ‌డం, మ‌రొక‌టి.. మొబైల్ నంబ‌ర్ ను అప్ డేట్ చేయ‌డం. అంటే వేరే నంబ‌ర్ ను లింక్ చేయ‌డం అన్న‌మాట‌. క‌నుక‌.. తొలి సారిగా మొబైల్ నంబ‌ర్ ను ఆధార్ కు లింక్ చేయ‌డం ఎలాగో ముందు తెలుసుకుందాం.

మొద‌టి సారి మొబైల్ నంబ‌ర్ ను లింక్ చేయ‌డానికి ఆన్ లైన్ లో కుద‌ర‌దు. ఎందుకంటే.. ఆన్ లైన్ లింకింగ్స్, అప్ డేట్స్ అన్నీ ఓటీపీ వెరిఫికేష‌న్ ద్వారానే ఉంటాయి. అది కూడా ఆధార్ కార్డుతో రిజిస్ట‌ర్ అయిన మొబైల్ నంబ‌ర్ కే ఓటీపీ వ‌స్తుంది. అందువ‌ల్ల మొద‌టి సారి లింక్ చేసేవాళ్లు అస‌లు మొబైల్ నంబ‌ర్ నే రిజిస్ట‌ర్ చేయ‌కపోవ‌డం వ‌ల్ల ఓటీపీ రాదు. దీని వల్ల ఆన్ లైన్ లింకింగ్ సాధ్య ప‌డ‌దు. అందుకే వాళ్ల‌కు ఆఫ్ లైన్ లో లింక్ చేసుకొనే సౌల‌భ్యాన్ని క‌ల్పించారు. దాని కోసం ఆధార్ అప్ డేట్ లేదా క‌రెక్ష‌న్ ఫామ్ ను నింపాలి. ఫామ్ కోసం ఆధార్ సెంట‌ర్ లేదా మీసేవ కేంద్రాలను సంప్ర‌దించ‌వ‌చ్చు. లేదంటే UIDAI వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. ఫామ్ మొత్తం నింపి మీ సేవ కేంద్రం లేదా ఆధార్ సెంట‌ర్ లో స‌బ్మిట్ చేయాలి. అందులో మొబైల్ నంబ‌ర్ మాత్ర‌మే యాడ్ చేయాల‌ని రాయాలి. ఫామ్ తో పాటు ఆధార్ కార్డు జీరాక్స్, ఏదైనా ఐడీ ప్రూఫ్ జిరాక్స్‌, పాన్ కార్డ్, పాస్ట్ పోర్ట్, ఓట‌ర్ ఐడీ.. ఏదైనా అటాచ్ చేసి ఇవ్వాలి. త‌ర్వాత‌ కేంద్రంలో బ‌యోమెట్రిక్ ను వెరిఫై చేస్తారు. అనంత‌రం అక‌నాలెడ్జ్ మెంట్ స్లిప్ ను అంద‌జేస్తారు. అంతే.. ఈ క్రమంలో మొబైల్ నంబ‌ర్ యాడ్ అవ్వ‌డానికి క‌నీసం 10 రోజుల స‌మ‌యం ప‌డుతుంది.

అయితే చాలా మంది ఇప్పుడు రిజిస్ట‌ర్ అయి ఉన్న మొబైల్ నంబ‌ర్ ను మార్చి వేరే నంబ‌ర్ ను అప్ డేట్ చేయాల‌నుకుంటారు. అటువంటి వాళ్లు.. ఆన్ లైన్ లో అప్ డేట్ చేసుకునే వెసులు బాటు ఉంది. అయితే.. ఆధార్ తో రిజిస్ట‌ర్ అయిన మొబైల్‌ నంబ‌ర్ ప్ర‌స్తుతం వాడుక‌లో ఉండాలి. ఇప్పుడు వాడ‌కంలో ఉన్న రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌ర్ కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. అలా చేయాల‌నుకునే వాళ్లు.. UIDAI వెబ్ సైట్ కు వెళ్లి.. ఆధార్ అప్ డేట్ రిక్వెస్ట్ ఆన్‌లైన్ అనే లింక్‌ ను క్లిక్ చేయాలి. వెంట‌నే, ఆధార్ సెల్ఫ్ స‌ర్వీస్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నంబ‌ర్, ‘కాప్చా టెక్స్ట్’ ఎంట‌ర్ చేయాలి. వెంట‌నే ఎంట‌ర్ చేసిన ఆధార్ నంబ‌ర్ తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబ‌ర్ కు ఓటీపీ వ‌స్తుంది. ఆ ఓటీపీ ని ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ బ‌ట‌న్ ను క్లిక్ చేయాలి. వెంట‌నే వేరే పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. ఆ పేజీలో అవ‌స‌ర‌మైన డిటేయిల్స్ ను అప్ డేట్ చేసుకోవ‌చ్చు. ‘సెల‌క్ట్ ఫీల్డ్స్ టూ అప్ డేట్’ ఆప్ష‌న్ లో మొబైల్ నంబ‌ర్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అక్క‌డ కొత్త మొబైల్ నంబ‌ర్ ను ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ కొట్టాలి. అంతే.. కొత్త మొబైల్ నంబ‌ర్ అప్ డేట్ అవుతుంది. అయితే.. అప్ డేట్ అయిన వెంట‌నే కొత్త మొబైల్ నంబ‌ర్ కు ఓటీపీ రాక‌పోవ‌చ్చు. UIDAI వెబ్ సైట్ డేటాబేస్ లో కొత్త మొబైల్ నంబ‌ర్ అప్ డేట్ కావ‌డానికి క‌నీసం 10 రోజుల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంటుంది. ఇలా మీరు మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top