మీ ఇల్లు లేదా ఆఫీస్‌లో ఇవి గ‌న‌క ఉన్నాయా..? వెంట‌నే తీసేయండి. లేదంటే బాగా న‌ష్ట‌పోతారు..!

డ‌బ్బు సంపాదించాల‌ని, దాంతో సుఖంగా సెటిల్ అవ్వాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి. ఎవ‌రైనా క‌ష్ట‌ప‌డేది అందుకోస‌మే క‌దా. త‌న‌కు, త‌న పిల్ల‌ల‌కు, కుటుంబ స‌భ్యుల‌కు మంచి జీవితం ఉండాల‌ని ఎవ‌రైనా క‌ష్ట‌ప‌డ‌తారు. డ‌బ్బు సంపాదిస్తారు. అయితే కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే ఆ క‌ల‌ను సాకారం చేసుకుంటారు. అయిన‌ప్ప‌టికీ సంపాదించిన డ‌బ్బు కొంద‌రికి స‌రిగ్గా నిల‌వ‌దు. అందుకు కార‌ణాలు అనేకం ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఎవ‌రైనా అలా డ‌బ్బు సంపాదిస్తున్న‌ప్ప‌టికీ అది నిల‌వ‌క‌పోతుంటే… అప్పుడు కింద చెప్పిన అంశాలు కార‌ణ‌మై ఉండొచ్చు. క‌నుక వీటి గురించి ఓ సారి తెలుసుకుని ఆ ప్ర‌కారం చేస్తే అప్పుడు ఆర్థిక స‌మ‌స్య‌లు పోయేందుకు అవ‌కాశం ఉంటుంది. ఆ అంశాలు ఏమిటో ఇప్ప‌డు తెలుసుకుందాం.

పావురాళ్లు…
మీ ఇల్లు లేదా ఆఫీస్‌లో ఎక్క‌డైనా పావురాళ్ల గూడును చూశారా..? అయితే వెంట‌నే దాన్ని తీసేయండి. తీసేయ‌మంటున్నాం క‌దా… అని ఆ ప‌క్షుల‌కు హాని క‌లిగించ‌కండి. మ‌రో చోటుకు ఆ గూడును మార్చండి. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయ‌ట‌. ఇల్లు లేదా ఆఫీస్ ఏదైనా అది పావురాళ్ల గూడుకు నివాసం అయితే ఆ నిర్మాణంలో ఉండే వారికి అన్నీ ఆర్థిక స‌మ‌స్య‌లే ఎదుర‌వుతాయ‌ట‌. డ‌బ్బు సంపాదించినా అది నిల‌వ‌ద‌ట‌. అందుక‌ని అలాంటి గూళ్ల‌ను కనుక చూస్తే వెంట‌నే వాటిని మార్చేయాలి.

తేనె తెట్టె…
ఇల్లు లేదా ఆఫీస్ ప‌రిస‌రాల్లో తేనె తెట్టె ఉంటే వెంట‌నే తీసేయండి. అవి ఉంటే ఇంట్లో బ‌య‌టా అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయ‌ట‌. ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటార‌ట‌. ఖ‌ర్చులు బాగా పెరుగుతాయ‌ట‌.

ఎండిపోయిన ఆకులు…
ఇల్లు లేదా ఆఫీస్ ప‌రిస‌రాల్లో, ఆ నిర్మాణాల్లో ఎండిపోయిన ఆకులు అస్స‌లు ఉండ‌రాదు. వాటితో ఆ నిర్మాణాల్లోకి నెగెటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మ‌వుతుంది. అప్పుడు వాటిలో ఉండే వారికి అన్నీ స‌మ‌స్య‌లే ఎదురవుతాయి.

గ‌బ్బిలాలు…
ఏ నిర్మాణం కూడా గ‌బ్బిలాల‌కు ఆవాసం కారాదు. అలా అయితే ఆ నిర్మాణంలో ఉండే వారికి దుర‌దృష్టం వెన్నంటి ఉంటుంది. వారు దారిద్ర్యంలోకి వెళ్తారు. డ‌బ్బులు అస్స‌లు మిగ‌ల‌వు. అనారోగ్యాలు కూడా క‌లుగుతాయి.

శిథిలావ‌స్థ‌…
శిథిలావ‌స్థ‌కు చేరుకున్న ఇంట్లో ఉండ‌డం ప్ర‌మాదం మాత్ర‌మే కాదు, అలా ఉంటే అంతా చెడే జ‌రుగుతుంది. వారికి దుర‌దృష్టం వెన్నంటి ఉంటుంది. డ‌బ్బులు బాగా ఖ‌ర్చ‌వుతాయి.

సాలెగూళ్లు…
ఏ నిర్మాణంలో కూడా సాలెగూళ్లు అస్స‌లు ఉండ‌రాదు. అలా ఉంటే అవి దుర‌దృష్టాన్ని తెచ్చి పెడ‌తాయి. ఆర్థిక స‌మ‌స్య‌లు వెన్నంటి త‌రుముతాయి.

Comments

comments

Share this post

scroll to top