మీ ఫేస్ బుక్ లో…ఈ 6 అంశాలుంటే..వెంట‌నే తొల‌గించుకోండి..లేదంటే మీకే రిస్క్.!!

చేతిలో ఓ స్మార్ట్‌ఫోన్‌.. అందులో ఇంట‌ర్నెట్‌.. ఫేస్‌బుక్ యాప్‌… ఉంటే చాలు. నేటి త‌రుణంలో మొబైల్ యూజ‌ర్లు స‌మ‌య‌మే తెలియ‌కుండా అందులో విహ‌రిస్తున్నారు. ఉద‌యం నిద్ర లేస్తూ పెట్టే స్టేట‌స్ మెసేజ్ మొద‌లుకొని రాత్రి ప‌డుకునేట‌ప్పుడు పెట్టే గుడ్ నైట్ పోస్టు వ‌ర‌కు రోజూ ఎన్నో పోస్టులు, లైక్‌లు, కామెంట్లు, షేర్స్‌తో ఫేస్‌బుక్‌లో విహ‌రిస్తున్నారు. అయితే ఇంత వ‌ర‌కు ఓకే. కానీ అలా ఫేస్‌బుక్‌లో పెట్టే పోస్టులు లేదా ఇత‌ర విష‌యాలు యూజ‌ర్ల‌కు ఒక వేళ ఇబ్బందులు క‌లిగిస్తే..? అంటే.. అవును, అలా కూడా అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. దాంతో న‌లుగురిలోనూ ప‌రువు పోవ‌చ్చు, లేదంటే జాబ్ పోవ‌చ్చు, ఇంకా ఏమైనా జ‌ర‌గ‌వ‌చ్చు. మ‌రి అలా కాకుండా ఉండాలంటే ఫేస్‌బుక్‌లో ఉండే వీటిని వెంట‌నే తొల‌గించాలి. అవేమిటంటే…

1. పుట్టిన‌రోజు వివ‌రాలు…
అదేంటీ… పుట్టిన రోజు వివ‌రాల‌ను ఫేస్‌బుక్ నుంచి తీసేయాలా..? అవి లేక‌పోతే అస‌లు అకౌంట్ ఎలా క్రియేట్ అవుతుంది. ఏజ్ ఎలా క‌న్ఫాం అవుతుంది. అవ‌త‌లి వారికి మ‌న పుట్టిన రోజు గురించి ఎలా తెలుస్తుంది..? అంటే అవును, పుట్టిన రోజు వివ‌రాల‌ను ఫేస్‌బుక్ నుంచి తీసేయాల్సిన ప‌నిలేదు. కానీ మీకు అందులో ఫ్రెండ్స్ గా ఉన్న వ్య‌క్తుల‌కు మాత్ర‌మే ఆ వివ‌రాల‌ను క‌న‌బ‌డేలా జాగ్ర‌త్త వ‌హించాలి. మిగిలిన వారికి క‌నిపించ‌కుండా ఉండేలా సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెక్యూరిటీ ఆప్ష‌న్స్‌లో ప్రైవ‌సీ సెట్టింగ్స్‌ను మార్చుకోవాలి. దీంతో మీ ఫేస్‌బుక్ అకౌంట్ సుర‌క్షితంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని బ్యాంకులు ఈ మ‌ధ్య పుట్టిన రోజు వివ‌రాల‌ను ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీల్లో సెక్యూరిటీ ప్ర‌శ్న‌ల కోసం వాడుతున్నాయి. ఈ క్ర‌మంలో అప‌రిచిత వ్య‌క్తుల‌కు ఆ వివ‌రాలు తెలిస్తే దాంతో వారు యూజ‌ర్ల బ్యాంక్ అకౌంట్‌ల‌ను హ్యాక్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఫేస్‌బుక్‌లో పుట్టిన రోజు వివ‌రాల‌ను క‌నిపించ‌కుండా చేసుకోవాలి.

2. లొకేష‌న్, హాలిడే ఫొటోలు…
చాలా మంది కొత్త ప్రాంతానికి వెళ్లిన‌ప్పుడు అక్క‌డి చెకిన్‌, హాలిడే, లొకేష‌న్ ఫొటోల‌ను త‌మ ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తారు. కానీ అలా చేయ‌కూడ‌దు. ఎందుకంటే ఇంట్లో ఎవ‌రూ లేర‌ని తెలిస్తే చోరీల‌కు పాల్ప‌డే వారు కూడా ఫేస్‌బుక్‌లో కాచుకుని ఉంటారు. వారి నుంచి జాగ్ర‌త్త వ‌హించాలంటే ఆ వివ‌రాల‌ను ఫేస్‌బుక్‌లో పెట్ట‌రాదు.

3. ఫేస్‌బుక్ ఫ్రెండ్‌గా బాస్‌…
ఉద్యోగాలు చేసే వారు త‌మ బాస్‌ను ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌గా చేర్చుకోక‌పోవ‌డ‌మే బెట‌ర్‌. ఎందుకంటే బాస్‌కు న‌చ్చ‌ని ప‌ని చేసి దాన్ని ఫేస్‌బుక్‌లో పెట్టినా, ఆఫీస్‌కు వ్య‌తిరేకంగా, బాస్‌కు వ్య‌తిరేకంగా పోస్టులు పెట్టినా అవి బాస్ దృష్టికి త్వ‌ర‌గా వెళ్తాయి కాబ‌ట్టి జాబ్ కోల్పోయే ప్ర‌మాదం ఉంటుంది. దీనికి తోడు మీ వ్య‌క్తిగ‌త జీవితం గురించి బాస్‌కు తెలిస్తే దాంతో మిమ్మ‌ల్ని ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్ కూడా చేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

4. ఫోన్ నంబ‌ర్‌…
ఫేస్‌బుక్‌లో ఫోన్ నంబ‌ర్ల‌ను అస్స‌లు పెట్ట‌రాదు. వెంట‌నే తీసేయాలి. ఒక వేళ త‌ప్ప‌నిస‌రి అనుకుంటే కేవ‌లం ఫ్రెండ్స్‌కు, బాగా ద‌గ్గ‌రివారికి మాత్ర‌మే ఫోన్ నంబ‌ర్ క‌నిపించేలా సెట్టింగ్స్‌ను మార్చాలి. ఎందుకంటే మొబైల్ బ్యాంకింగ్ వంటి వాటికి ఫోన్ నంబ‌రే కీల‌కం. ఎవ‌రైనా స్విమ్ స్వాప్ పద్ధ‌తిలో మీ ఫోన్ నంబ‌ర్ తో వేరే సిమ్ తీసుకుంటే అప్పుడు మీ మొబైల్ బ్యాంకింగ్ అకౌంట్‌లోకి వారు సుల‌భంగా లాగిన్ అవుతారు. క‌నుక ఫేస్‌బుక్‌లో అంద‌రికీ తెలిసేలా ఫోన్ నంబ‌ర్‌ను పెట్ట‌క‌పోవ‌డ‌మే మంచిది.

5. మ‌ద్యం తాగుతున్న ఫొటోలు, వీడియోలు…
చాలా మంది మ‌ద్యం తాగుతూ వాటికి చెందిన ఫొటోల‌ను, వీడియోల‌ను తీసి ఫేస్‌బుక్‌లో పెడ‌తారు. అయితే ఇది ఉద్యోగం పొందాల‌నుకునే వారికి ప్ర‌తికూల అంశం. ఎందుకంటే చాలా వ‌ర‌కు కంపెనీలు ఇప్పుడు ఉద్యోగుల వ్య‌క్తిత్వం, ఇష్టాలు, వారి గుణాలు తెలుసుకునేందుకు ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను అడుగుతున్నాయి. ఒక వేళ ఏదైనా కంపెనీ మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను గ‌న‌క అడిగితే, అప్పుడు అందులో మ‌ద్యం తాగుతున్న ఫొటోలు, వీడియోలు వంటివి కనిపిస్తే ఇక జాబ్ రావడం అనేది జ‌ర‌గ‌దు. క‌నుక ఈ విష‌యంలో ఎవ‌రైనా జాగ్ర‌త్త వ‌హించాల్సిందే. అలాంటి ఫొటోల‌ను, వీడియోల‌ను చూపి బ్లాక్ మెయిల్ చేసేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది.

6. మాజీల ఫొటోలు…
నేటి త‌రుణంలో ప్రేమించుకోవ‌డం, విడిపోవ‌డం స‌హ‌జం. అయితే క‌లిసి ఉన్నంత వ‌ర‌కు ఫర్లేదు. కానీ విడిపోతే మాత్రం ప్రేయ‌సి, ప్రియుడు ఇద్ద‌రూ త‌మ త‌మ ఫేస్‌బుక్ అకౌంట్ల‌లో అవ‌తలి వారి ఫొటోలు, వీడియోలు, సందేశాలు, ఇత‌ర వివ‌రాల‌ను తీసేయడం ఉత్తమం. లేదంటే భ‌విష్య‌త్తులో ఒక వేళ ఇత‌రుల‌ను వివాహం చేసుకుంటే అప్పుడవి ఇబ్బందులు క‌లిగించ‌వ‌చ్చు. దీంతో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక మాజీ ప్రేయ‌సి, ప్రియుడు ఫొటోల‌ను, వీడియోల‌ను, ఇత‌ర వివ‌రాల‌ను కూడా ఫేస్‌బుక్ అకౌంట్ల నుంచి తీసేయాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top