మీ ఇంట్లో దోమ‌లు, పురుగులు, ఎలుక‌లు ఎక్కువ‌గా ఉన్నాయా..? అయితే కేవ‌లం ఒకే మిశ్ర‌మంతో వాటిని దూరంగా త‌రిమి కొట్టేయ‌వ‌చ్చు..!

మ‌న ఇళ్ల‌లో దోమ‌లు, పురుగులు, ఎలుక‌ల లాంటివి ఉంటే వాటి వ‌ల్ల మ‌నం ఎన్ని ఇబ్బందుల‌కు గుర‌వుతామో అంద‌రికీ తెలుసు. జాగ్ర‌త్త‌గా లేక‌పోతే వాటితో ఎన్నో ర‌కాల అనారోగ్యాలు కూడా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ క్ర‌మంలో వాటిని నిర్మూలించేందుకు ఒక్కో ర‌క‌మైన ప‌ద్ధ‌తిని మ‌నం అవలంబిస్తుంటాం. దోమ‌ల‌కైతే రీపెల్లెంట్‌ల‌ను, బొద్దింక‌ల వంటి పురుగుల‌కైతే హిట్ లాంటి స్ప్రేల‌ను, ఎలుక‌ల‌కైతే మందును వాడుతాం. కానీ వాట‌న్నింటినీ కేవ‌లం ఒకే ద్ర‌వంతో నిర్మూలించ‌వ‌చ్చు. ఆ ద్ర‌వాన్ని మ‌నం ఇంట్లోనే సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అదెలాగంటే…

mint-for-rats-mosquitoes

పుదీనా తెలుసుగా..! ఎన్నో ర‌కాల ఔష‌ధ గుణాలు దాంట్లో ఉన్నాయి. నిత్యం మ‌నం దీన్ని వంట‌కాల్లో ఉప‌యోగిస్తుంటాం. పుదీనా నుంచి వ‌చ్చే చ‌క్క‌ని వాస‌న మ‌న‌కైతే ఎంతో ఆహ్లాదాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. కానీ అదే పుదీనాతో త‌యారు చేసిన మిశ్ర‌మం పైన చెప్పిన వాటి నుంచి మ‌న‌కు ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తుంది.

నిమ్మ లేదా నారింజ‌ల‌లో ఏ పండైనా తీసుకుని దాని తొక్క‌ల‌ను సేక‌రించాలి. వాటితోపాటు కొన్ని పుదీనా ఆకుల‌ను క‌లిపి ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని దాంట్లో ముందు చెప్పిన ప‌దార్థాల‌ను వేయాలి. అనంత‌రం ఆ నీటిని బాగా మ‌రిగించాలి. నీరు బాగా మ‌రిగాక స్టవ్ ఆర్పి ఆ ద్ర‌వాన్ని చ‌ల్లార‌నివ్వాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని రాత్రంతా అలాగే వ‌దిలేయాలి. ఉదయాన్నే ఆ మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టి ద్ర‌వాన్ని సేక‌రించాలి. ఆ ద్ర‌వంలో ర‌బ్బింగ్ ఆల్క‌హాల్ (దీన్ని స‌ర్జిక‌ల్ స్పిరిట్ అని కూడా పిలుస్తారు, మార్కెట్‌లో ఇది మ‌న‌కు ల‌భిస్తుంది)ను స‌మాన భాగంతో క‌ల‌పాలి. త‌దుప‌రి వ‌చ్చే మిశ్ర‌మాన్ని స్ప్రే బాటిల్‌లో నిల్వ చేసుకుని కీట‌కాలు తిరిగే ప్రాంతంలో స్ర్పే చేయాలి. అంతే, దీంతో ఇళ్ల‌లో ఇక‌పై దోమ‌లు, పురుగులు, ఎలుక‌లు అస్స‌లు క‌నిపించ‌వు.

Comments

comments

Share this post

scroll to top