ఈ ప్ర‌మాద‌క‌ర‌మైన యాప్స్ మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉన్నాయా..? వెంట‌నే తీసేయండి..!

ఆండ్రాయిడ్ టాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్ ఏదైన‌ప్ప‌టికీ వాటిల్లో గూగుల్ ప్లే స్టోర్ క‌చ్చితంగా ఉంటుంది. దాన్నుంచే యూజ‌ర్లంద‌రూ యాప్స్‌, గేమ్స్ వంటివి డౌన్ లోడ్ చేసుకుంటారు. ఇది గూగుల్ కు చెందిన అఫిషియ‌ల్ స్టోర్ కావ‌డంతో అందులో ఉంచే యాప్స్ అన్నీ సుర‌క్షిత‌మైన‌వేన‌ని యూజ‌ర్లు భావిస్తున్నారు. కానీ అది త‌ప్పు. ఎందుకంటే ప్లే స్టోర్‌లోనూ ప‌లు మాల్‌వేర్‌, వైర‌స్ క‌లిగిన యాప్స్ ఉన్నాయ‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఓ ప్ర‌ముఖ ఐటీ సెక్యూరిటీ సంస్థ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలోనే గూగుల్ చాలా వ‌ర‌కు అలాంటి మాల్‌వేర్ ఉన్న యాప్స్‌ను ఇప్ప‌టికే ప్లే స్టోర్ నుంచి తొల‌గించి వేసింది. కానీ ఇంకా అందులో చాలా యాప్స్ ఉన్నాయ‌ట‌. అలాంటి వాటిలో కొన్నింటి వివ‌రాల‌ను కింద ఇస్తున్నాం. వీటిలో గ‌న‌క ఏవైనా యాప్స్‌ను మీరు ఇప్ప‌టికే వాడుతుంటే వెంట‌నే ఫోన్‌లోంచి తీసేయండి. లేదంటే ఎంతో విలువైన మీ వ్య‌క్తిగ‌త స‌మాచారం, బ్యాంకింగ్ వివ‌రాలు హ్యాక‌ర్ల చేతుల్లోకి వెళ్లే ప్ర‌మాదం ఉంది. ఆ యాప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1. గైడ్ ఫ‌ర్ ఫిఫా మొబైల్ (Guide for FIFA Mobile)
గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న ఈ యాప్ లో వైర‌స్ ఉంది. దీన్ని వెంట‌నే తీసేయండి. ఇప్పటికే దీన్ని ల‌క్ష మంది దాకా ఇన్‌స్టాల్ చేసుకున్న‌ట్టు స‌మాచారం. ఈ యాప్ మీ డివైస్‌లో ఉంటే వెంట‌నే అన్ ఇన్‌స్టాల్ చేసేయండి.

2. గైడ్ ఫ‌ర్ లెగో నెక్సో నైట్స్ (Guide for LEGO Nexo Knights)
ప్లే స్టోర్‌లో ఉన్న ఈ యాప్‌లో మాల్‌వేర్ ఉంది. దీన్ని ఇప్ప‌టికే 50వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇది గ‌న‌క మీ ఫోన్‌లో ఉంటే వెంటనే తీసేయండి.

3. గైడ్ ఫ‌ర్ రోలింగ్ స్కై (Guide for Rolling sky)
దీన్ని 10వేల మంది యూజ‌ర్లు ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఈ యాప్ కూడా ప్ర‌మాద‌క‌ర‌మే. క‌నుక దీన్ని కూడా తీసేయండి.

4. గైడ్ ఫ‌ర్ లెగో సిటీ మై సిటీ (Guide for LEGO City My City)
ఈ యాప్‌ను 50వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇది కూడా ప్రమాద‌క‌ర‌మైన యాపే. వెంట‌నే తీసేయండి.

5. గైడ్ ఫ‌ర్ పోకిమాన్ గో (Guide for Pokemon GO)
పోకిమాన్ గేమ్‌కు చెందిన గైడ్ యాప్‌గా ఇది ప్లే స్టోర్ లో ఉంది. దీన్ని లక్ష మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇది కూడా ప్ర‌మాద‌క‌ర‌మైన యాప్ క‌నుక దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే వెంట‌నే తీసేయాలి.

6. గైడ్ డ్రీమ్ లీగ్ సాక‌ర్ (Guide Dream League Soccer)
ఈ యాప్‌ను 50వేల మంది ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ కూడా మాల్‌వేర్‌ను క‌లిగి ఉంది. క‌నుక ఈ యాప్ ఫోన్‌లో ఉంటే వెంట‌నే తీసేయండి.

7. లీగైడ్ లెగో సిటీ అండ‌ర్ క‌వ‌ర్ (LEGUIDE LEGO City Undercover)
ఇది కూడా ప్ర‌మాద‌క‌ర‌మైన యాపే. దీన్ని ఇప్ప‌టికే 50వేల మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు. మీరు కూడా ఆ ప‌ని చేసి ఉంటే వెంట‌నే తీసేయండి.

8. గైడ్ ఫ‌ర్ కాడిల్లాక్స్ (Guide for Cadillacs)
దీన్ని 10వేల మంది వ‌ర‌కు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇందులోనూ వైర‌స్ ఉన్న‌ట్టు గుర్తించారు. క‌నుక దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న వారు వెంట‌నే తీసేయండి.

9. లీగైడ్ లెగో సిటీ మై సిటీ (LEGUIDE LEGO City My City)
దీన్ని 10వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇది కూడా ప్ర‌మాద‌క‌ర‌మైన యాపే. దీన్ని ఫోన్‌లోంచి తీసేయండి.

10. గైడ్ ఫ‌ర్ ఫిఫా 17 (Guide For FIFA 17)
ఈ యాప్‌ను 50 వేల మంది యూజ‌ర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇందులోనూ మాల్‌వేర్ ఉంది. క‌నుక దీన్ని కూడా తొల‌గించండి.

11. గైడ్ ఫ‌ర్ స్లిత‌ర్‌.ఐఓ (Guide for slither.io)
సుమారు 1 ల‌క్ష మంది యూజ‌ర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అలా గ‌న‌క మీరు కూడా చేసి ఉంటే వెంట‌నే ఈ యాప్‌ను తీసేయడం మంచిది.

Comments

comments

Share this post

scroll to top