ల‌వ‌ర్ మోసం చేసింద‌ని… సూసైడ్ చేసుకున్న నరేష్ “ప్రొఫైల్” ని ఫేస్బుక్ ఏం చేసిందో తెలుసా?

ల‌వ‌ర్ మోసం చేసింద‌ని…ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి, రైలు కింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న న‌రేష్ గురించి అంద‌రికీ తెలిసిందే…ఇలాంటి ఘ‌ట‌న‌లు అనేకం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ…న‌రేష్ ఇష్యూ మాత్రం చాలా వైర‌ల్ అయ్యింది, దానికి కార‌ణం అత‌ను త‌న మ‌ర‌ణానికి ముందు త‌న ల‌వ‌ర్ కు సంబంధించిన డీటైల్డ్ స‌మాచారం ఫోటోస్ తో స‌హా…ఫేస్ బుక్ లోని త‌న అకౌంట్ లో పోస్ట్ చేయండి. అయితే సాధారణంగా మనిషి చనిపోతే..అతని ఫేస్బుక్ అకౌంట్ క్లోజ్ అవుతుంది. కానీ నరేష్ చివరి కోరిక మేరకు…. అతని పోస్ట్ అందరికి చేరాలని, అతని స్నేహితులకు గుర్తుండాలి ఫేస్బుక్ అతని ప్రొఫైల్ ను remembering గా మార్చింది.

ఫేస్ బుక్ యూజ‌ర్ చ‌నిపోయాక‌….అత‌ని అకౌంట్ ఏమ‌వుతుంది? మ‌రింత స‌మాచారం.!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేస్‌బుక్ యూజర్లలో మృతి చెందిన వారి అకౌంట్లు దాదాపు 30 మిలియన్ల వరకు ఉన్నాయని, రోజుకు ప్రపంచ వ్యాప్తంగా 8 వేల మంది ఫేస్‌బుక్ యూజర్లు చనిపోతున్నారని సాక్షాత్తూ ఫేస్‌బుక్ సంస్థే తెలియజేసింది. ఈ క్రమంలో అసలు ఒక ఫేస్‌బుక్ యూజర్ చనిపోతే అతని అకౌంట్ ఏమవుతుంది? అనే ఒక సందేహాన్ని పలువురు యూజర్లు ఫేస్‌బుక్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన ఫేస్‌బుక్ ప్రతినిధులు అలాంటి వారి కోసం ఓ ప్రత్యేక సదుపాయాన్ని కల్పించారు. అదేమిటంటే లెగసీ కాంటాక్ట్.

ఫేస్‌బుక్‌లో లభ్యమవుతున్న ఈ లెగసీ కాంటాక్ట్ అనే ఫీచర్ ద్వారా యూజర్లు తాము చనిపోయాక తమ అకౌంట్ దానంతట అదే డిలీట్ అవ్వాలా? వద్దా? అనేది ముందుగానే నిర్ణయించుకోవచ్చు. ఒక వేళ అకౌంట్ వద్దనుకుంటే ఆ వ్యక్తి చనిపోయాక ఫేస్‌బుక్‌లో అతనికి ఫ్రెండ్స్‌గా ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యులు ఫేస్‌బుక్‌కు ఓ రిక్వెస్ట్ పంపితే చాలు, ఆ అకౌంట్ డిలీట్ అయిపోతుంది. లేదు, అకౌంట్ కొనసాగాలని అనుకుంటే లెగసీ కాంటాక్ట్‌లో యూజర్ తనకు అత్యంత క్లోజ్‌గా ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా ఒక ఫేస్‌బుక్ ఐడీని ఆ కాంటాక్ట్‌లో ఇవ్వవచ్చు. దీంతో యూజర్ చనిపోయినప్పుడు లెగసీ కాంటాక్ట్‌లో ఇచ్చిన ఐడీ ప్రకారం సంబంధిత వ్యక్తులు చనిపోయిన వ్యక్తి ఫేస్‌బుక్ అకౌంట్‌ను నిర్వహించవచ్చు. అయితే ఆ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యేందుకు మాత్రం అవకాశం ఉండదు. కాకపోతే ఆ అకౌంట్‌కు చెందిన ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్ మెసేజ్ వంటివి మార్చవచ్చు. ఫ్రెండ్స్ రిక్వెస్ట్‌లకు స్పందించవచ్చు. టైమ్‌లైన్‌లో ఆ యూజ‌ర్‌ను మిస్ అవుతున్నామ‌ని ఏదైనా పోస్ట్ చేయవచ్చు. కానీ లాగిన్ అయ్యేందుకు, పాత పోస్టులు, ఇమేజ్‌లను డిలీట్ చేసేందుకు అవకాశం ఉండదు.

అయితే ఎవరైనా వ్యక్తి చనిపోతే అతని ఫేస్‌బుక్ అకౌంట్ ప్రొఫైల్‌లో Remembering అనే మెసేజ్ దర్శనమిస్తుంది. ఇందుకోసం ఆ వ్యక్తికి చెందిన ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ ఫేస్‌బుక్‌కు రిక్వెస్ట్ పంపించాల్సి ఉంటుంది. దాన్ని ఫేస్‌బుక్ ఓకే చేస్తే ఇక ఆ వ్యక్తి ఫేస్‌బుక్ అకౌంట్ Memorialized Timeline గా కనిపిస్తుంది. అనంతరం లెగసీ కాంటాక్ట్‌లో ఇచ్చిన ఐడీ ప్రకారం ముందుకు సాగాల్సి ఉంటుంది. అది ఇవ్వలేదంటే ఆ వ్యక్తి అకౌంట్ అలాగే ఉండిపోవడమో, డిలీట్ అవడమో జరుగుతుంది. అది కూడా ఇతర ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపితేనే జరుగుతుంది. ఈ క్రమంలో Memorialized Timeline గా మారిన ఫేస్‌బుక్ యూజర్‌కు చెందిన విషయాలేవీ ఇతరులకు కనిపించవు. ఉదాహరణకు… బర్త్‌డే రిమైండర్లు, పీపుల్ సజెషన్స్ వంటివి. అయితే ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఆ యూజర్ క్రియేట్ చేసిన పేజీలు కూడా డిలీట్ అవుతాయి. దీంతో ఇవి కూడా ఎవరికీ కనిపించవు.

సో, మీరూ మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో లెగసీ కాంటాక్ట్‌ను యాడ్ చేయాలనుకుంటే ఫేస్‌బుక్‌లోకి వెళ్లి సెట్టింగ్స్ – సెక్యూరిటీ – లెగసీ కాంటాక్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే మీకు బాగా దగ్గరి వారినే లెగసీ కాంటాక్ట్ ఐడీలుగా ఇవ్వండి. లేదంటే ఇతరుల చేతిలోకి మీ సమాచారం వెళ్లే ప్రమాదం ఉంటుంది. మనం ఉన్నా, లేకపోయినా మన సమాచారం మాత్రం విలువైందే కదా!

FOR Naresh FB Account : CLICK

Comments

comments

Share this post

scroll to top