ఈ న‌గ‌రానికి ఏమైంది.. యాడ్‌లో చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా..?

సినిమా థియేట‌ర్ల‌లో మూవీని ప్లే చేయ‌డానికి ముందు నో స్మోకింగ్ యాడ్ వేస్తారు క‌దా. ఇప్పుడంటే యాడ్స్ మార్చారు, కానీ నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఓ యాడ్ వ‌చ్చేది. అదేనండీ.. ఈ న‌గ‌రానికి ఏమైంది, ఒక వైపు దుమ్ము, మ‌రో వైపు నుసి, ఎవ‌రూ నోరు మెద‌ప‌రేంటి.. అంటూ యాడ్ వ‌చ్చేది. అయితే ఈ యాడ్‌కు ఎంత మంది స్మోకింగ్ మానేశారో, లేదో తెలియదు కానీ.. ఈ యాడ్‌లో న‌టించిన చిన్న పాప గుర్తుంది క‌దా. అవును, ఆమే. అయితే ఆ పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఆమె పేరు సిమ్ర‌న్ న‌టేక‌ర్‌. 2002లో ముంబైలో జ‌న్మించింది. ఈమెకు 7 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు.. అంటే.. 2009లో నో స్మోకింగ్ యాడ్ తీశారు. అదే.. పైన చెప్పాం క‌దా.. అదే యాడ్‌. అప్ప‌టి నుంచి నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ యాడ్ ను ప్లే చేశారు. కానీ రెస్పాన్స్ ఏమీ లేక‌పోవ‌డంతో దాన్ని మార్చి మాజీ క్రికెట‌ర్ ద్రావిడ్ చేత యాడ్ చేయించారు. అయితే ఆ పాత యాడ్‌లో న‌టించిన పాప సిమ్ర‌న్‌కు ఇప్పుడు 15 ఏళ్లు. మ‌రి ఇప్పుడు ఆమె ఎలా ఉందో చూశారా..! ఫొటోల్లో ఉన్న‌ది ఆమే. కావాలంటే ఆ ఫొటోల‌ను చూడండి.

ఆ యాడ్ తీయ‌డం ఏమోగానీ సిమ్ర‌న్ ఇప్పుడు స్టార్ అయిపోయింది. సెల‌బ్రిటీగా మారింది. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో ఆమెకు ఫ్యాన్స్ కూడా ఎక్కువైపోయారు. ఆమె ఇన్‌స్టాగ్రాంను ప్ర‌స్తుతం 3.54 ల‌క్ష‌ల మంది ఫాలో అవుతున్నారు అంటే ఆమె ఫాలోయింగ్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. అయితే సిమ్ర‌న్ పేరిట ఓ రికార్డు కూడా ఉంది. బాగా సుదీర్ఘ కాలం పాటు ర‌న్ అయిన యాడ్‌లో న‌టించిన న‌టిగా ఆమె గుర్తింపు పొందింది. దీంతోపాటు ప‌లు సినిమాలు, సీరియ‌ల్స్‌లోనూ ఆమె న‌టిస్తోంది. అదీ.. ఆమెకు ఉన్న పాపులారిటీ..!

Comments

comments

Share this post

scroll to top