నేటి తరుణంలో సోషల్ మీడియా ప్రభావం జనాలపై ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఏదైనా ఒక విషయం వైరల్ అయితే దాన్ని నిజమే అని నమ్ముతారు. కానీ అందులో ఎంత నిజం ఉంది ? అది అబద్దం అయి ఉండొచ్చు కదా.. అని ఎవరూ ఆలోచించడం లేదు. అందుకనే కొందరు సోషల్ మీడియాను పావుగా వాడుకుని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ… అసలు ఈ మధ్య కాలంలో ఇలా సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారమైన వార్త ఏమిటో తెలుసా..? అదేనండీ.. ఇరాన్‌కు చెందిన సహర్ తబర్ అనే యువతి కదా. ఈమె 50 ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకుని హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీలా మారాలనుకుందని, కానీ అవి వికటించి దెయ్యంలా మారిందని ఈ మధ్యే సోషల్ మీడియాలో వైరల్‌గా వార్తలు వచ్చాయి కదా. అనేక ప్రముఖ వార్తా ప్రతికలు, మీడియా చానళ్లు కూడా ఈ వార్తను ప్రధానంగా ప్రచురించాయి, ప్రసారం చేశాయి కూడా. అయితే నిజానికి మీకు తెలుసా..? ఇదొక ఫేక్ వార్త. అంటే… నిజానికి ఆ యువతి అలా ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకోలేదట. అది మేకప్ అట..!
ఏంటీ షాకయ్యారా..! అవును, మీరు విన్నది నిజమే. సహర్ తబర్ అనే యువతి అలా 50 ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకోలేదు. అవును, ఆమె అలా దెయ్యంలా మేకప్ వేసుకుంది. దాంతోపాటు ఆమె ముఖాన్ని ఫొటోలు తీసి దాన్ని ఫొటోషాప్ చేశారు. అంతే.. ఇక ఆ ఫొటోలను చూసి జనాలు నిజమే అనుకున్నారు. దీంతో కొందరు ఆ ఫొటోలను వాడుకుని తప్పుగా వార్తలను ప్రచారం చేశారు.
అయితే నిజానికి సహర్ తబర్ అలా ఎందుకు చేసిందో తెలుసా..? సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని మాత్రం కాదు. ఆమెకు మేకప్ పిచ్చి అట. ఇలాగే రక రకాలుగా మేకప్‌లు వేసుకుని ఫొటోలు తీసుకుంటుందట. అందులో భాగంగానే తాజాగా అలా దెయ్యం గెటప్ వేసుకుంది. ఆ క్రమంలోనే ఫొటోలు తీయించుకుంది. కానీ వాటిని ఎవరో తప్పుగా సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అవి వైరల్ అయ్యాయి. అంతే కానీ.. సహర్ తబర్ నిక్షేపంగా ఉంది. ఆమె ప్లాస్టిక్ సర్జీలను చేయించుకోలేదు. అలాంటి ఆలోచన కూడా తనకు లేదని ఆమె చెప్పింది. చూశారుగా.. సోషల్ మీడియా ఎంత పని చేసిందో..! కనుక ఏదైనా వైరల్ న్యూస్‌ను నిజమే అని నమ్మేముందు ఒకసారి ఆలోచించుకోండి..!