“రిలయన్స్ జియో” మరో సంచలన నిర్ణయం!.ఫ్రీ కాలింగ్, డాటా మరింతమందికి అందే ప్రయత్నం!.కానీ మన రాష్ట్రంలో

సెప్టెంబర్ 5న భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి.. పోటీ సంస్థలకు నిద్ర లేకుండా చేస్తోన్న రిలయెన్స్ జియో.. ఉచిత ఆఫర్లతో అనతి కాలంలోనే భారీగా కస్టమర్లను ఆకర్షించిన అన్ లిమిటెడ్ ఫ్రీకాల్స్, ఫ్రీ డేటా అంటూ ముకేశ్ సంస్థ యూజర్లకు పండగే అంటుంది. ఇపుడు టెలికాం రంగంలో సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచిన రిలయన్స్ జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ రిలయన్స్ జియో సిమ్ తీసుకున్న వారికి 7,8,9 సిరీస్‌లో నంబర్ కేటాయించిన జియో ఇక మీదట కొత్తగా సిమ్ తీసుకునే వారికి ఈ మూడు సిరీస్‌లో నంబర్లను నిలుపుదల చేయాలని భావిస్తోంది. వాటికి ప్రత్యామ్నయంగా ‘6’ సిరీస్‌లో రిలయన్స్ జియో నంబర్లు అందుబాటులోకి రానున్నాయి. టెలికాం శాఖ కూడా రిలయన్స్ జియో ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అయితే మొదటి దశలో కొన్ని సర్కిల్స్‌లో మాత్రమే 6 సిరీస్‌తో రానున్న కొత్త నంబర్లను జియో అందించనుంది. ఇలా ‘6’ సిరీస్‌తో ఫోన్ నంబర్లను అందించడం ద్వారా మరింత మంది కస్టమర్లను ఆకర్షించొచ్చని రిలయన్స్ జియో యాజమాన్యం భావిస్తోంది.

ఈ కొత్త సిరీస్‌తో రానున్న నంబర్లను ప్రస్తుతానికి అస్సాం, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయాలని జియో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నంబర్ల కేటాయింపు కూడా ఎంఎస్‌సీ(మొబైల్ స్విచ్ఛింగ్ కోడ్) ఆధారంగా జరుగుతుంది. 60010 నుంచి 60019 ఎంఎస్‌సీ సిరీస్‌‌ను రాజస్థాన్‌కు, 60020 నుంచి 60029 సిరీస్‌ను అస్సాంకు, 60030 నుంచి 60039 ఎంఎస్‌సీ సిరీస్‌లో ఉన్న నంబర్లను తమిళనాడుకు కేటాయిస్తున్నట్లు జియో ప్రకటించింది. మధ్యప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాలకు ‘7’ సిరీస్‌ను, కోల్‌కత్తా, మహారాష్ట్రకు ‘8’ సిరీస్‌లోనూ జియో నంబర్లను కేటాయించింది. తెలుగు రాష్ట్రాలకు ‘6’ సిరీస్ నంబర్లు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదు.

Comments

comments

Share this post

scroll to top