మీరు “రిలయన్స్ జియో” వినియోగాదారులా?.. అయితే మీకో గుడ్ న్యూస్!

ప్రస్తుతం ఎంతో నెట్ ఉపయోగిస్తున్నాం అంటే దానికి కారణం రిలయన్స్ జియో అందించిన ఫ్రీ డేటా ఆఫర్..టీనేజ్ స్టూడెంట్స్ అయితే జియో ఒక కల్పవృక్షంలా భావించేస్తున్నారు..అదృష్టం బాగుంటే అప్పుడప్పుడు మనకి ఫ్రీ కాల్స్ కూడా కలుస్తూ ఉంటాయి…డిసెంబర్ 31 వరకు ఉన్న ఆఫర్ ని మార్చ్ 31 వరకు పొడిగించారు!…మరి 31 మార్చ్ తరవాత జియో వినియోగదారుల పరిస్థితి ఏంటి?…మార్చ్ 31 లోపు జియో కస్టమర్స్ అయిన వారందరికీ “జియో ప్రైమ్ మెంబర్షిప్” ఇవ్వనున్నట్టు “ముకేశ్ అంబానీ” అధికారికంగా ప్రకటించారు!…

“జియో ప్రైమ్ మెంబర్షిప్” కార్యక్రమం మార్చ్ 1 నుండి మార్చ్ 31 వరకు ఉంటుంది…ఆ నెల వ్యవధిలో జియో కస్టమర్లు 99 రూపాయలు చెల్లించి ప్రైమ్ మెంబర్షిప్ పొందవచ్చు…ఆ తరవాత నుండి ఇప్పుడున్న  సేవలు అందుకోవాలి  అంటే నెలకి 303 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది!

రిలయన్స్ జియో ఇక పై ఫ్రీగా ఉపయోగించలేము అనుకుంటున్న సమయంలో ఒక చిన్న గుడ్ న్యూస్ విడుదల చేసింది రిలయన్స్ కంపెనీ. మనం మాములుగా “సిమ్ కార్డు” కానీ ఫోన్ కానీ పోతే. కస్టమర్ కేర్ కి కాల్ చేసి ముందుగా మన ఫోన్ నెంబర్ బ్లాక్ చేయిస్తాము. తరవాత అదే నెంబర్ మీద మరో సిమ్ తీసుకుంటాము. ఇదంతా జరగడానికి చాలా సమయం పడుతుంది. కానీ “రిలయన్స్ జియో” వినియోగదారులు ఇంత పెద్ద ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిన పని లేదు.

క‌స్ట‌మ‌ర్లు వాడుతున్న సిమ్ పోయినా లేదా మొబైల్ ఫోన్ పోయినా కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పింది. ఇందుకోసం స‌స్పెండ్, రెజ్యూమ్ అనే ఆప్ష‌న్‌ను జియో ఫీచ‌ర్‌లో ఉంచిన‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది.  ఒక‌వేళ క‌స్ట‌మ‌ర్ సిమ్ కార్డ్ పోగొట్టుకున్న‌ట్ల‌యితే ఈ ఆప్ష‌న్ ద్వారా త‌న సిమ్ మ‌రొక‌రు వాడ‌కుండా సస్పెండ్ మోడ్‌లో ఉంచొచ్చు. సిమ్ దొరికిన త‌ర్వాత మ‌ళ్లీ రెజ్యూమ్ మోడ్‌లోకి తీసుకొస్తే సిమ్ పనిచేస్తుంద‌ని తెలిపింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌  www.Jio.com/myaccount కు లాగిన్ అయి సస్పెండ్/ రెజ్యూమ్  ఆప్ష‌న్స్ ఉప‌యోగించొచ్చు. కొత్త సిమ్ కోసం మ‌ళ్లీ క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ సెంట‌ర్‌కు వెళ్లి డ‌బ్బులు చెల్లించ‌న‌వ‌స‌రం లేద‌ని వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి సస్పెండ్/ రెజ్యూమ్ మోడ్‌తో సులువుగా ప‌ని పూర్తి చేసుకోవ‌చ్చ‌ని జియో యాజ‌మాన్యం వెల్ల‌డించింది.

Comments

comments

Share this post

scroll to top