ప్రత్యర్థులకు పెద్ద షాక్..! “జియో” సరికొత్త ఆఫర్..! ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ ఎక్స్చేంజి చేస్తే…!

మొదట మూడు నెలలు ఉచిత కాల్స్, డేటా..తరవాత న్యూ ఇయర్ ఆఫర్ కింద మరో మూడు నెలలు పొడిగింపు..ఇటీవలే సమ్మర్ సుర్ప్రైస్ ఆఫర్ అని “303 ” రూపాయలకే మూడు నెలలు ఉచిత డేటా, కాల్స్ సేవలు అందించాలని నిర్ణయించుకుంది. కానీ ట్రై దీనికి వ్యతిరేకం చెప్పింది. ఇక జియో దూకుడుకు అడ్డుకట్ట పడినట్టేనని భావించాయి.  అక్కడితో ఆగకుండా dth సేవల్లోకి మరియు లాప్టాప్ రంగంలోకి కూడా “రిలయన్స్ జియో” అడుగుపెట్టనుంది. ఇటీవలే “ధన్ ధనా ధన్” ఆఫర్ తో కేవలం 309 రూపాయలకే 3 నెలలు ఉచిత డేటా, కాల్స్ పొందే ఆఫర్ ఇచ్చారు. ఇలా ఎప్పటికప్పుడు ప్రత్యర్థి టెలికాం కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న “జియో”…మరో సంచలన నిర్ణయంతో ముందుకొచ్చింది!

ప్రత్యర్థి కంపెనీల పాత డాంగిల్, డేటా కార్డు, వైఫై రూటర్లను జియో వైఫై 4జీ రూటర్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటే 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. రెండు ప్లాన్స్ తో జియో ఈ సంచలన ఆఫర్ ను ప్రకటించింది.

మొదటి ఆఫర్ :

  • ఏ కంపెనీది అయినా డేటాకార్డ్‌, డాంగిల్‌, హాట్‌స్పాట్ రూట‌ర్‌ను జియో డిజిట‌ల్ స్టోర్‌లో ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే వంద‌శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వ‌నుండ‌గా రూ.2010 విలువైన 4జీ డేటాను ఇవ్వ‌నున్న‌ట్టు పేర్కొంది. అయితే “జియో ఫై రూట‌ర్” కోసం వినియోగ‌దారులు రూ.1999 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.1999 కస్టమర్ చెల్లిస్తాడు. అతనికి రూ.2010 ఉచితంగా 4జీ డేటాను జియో ఇస్తోంది.

రెండో ఆఫర్:

  • రెండో ఆఫర్ లో డేటా కనెక్షన్ ను ఎక్స్చేంజి చేయాల్సిన అవసరం లేదు. జియో ప్రైమ్ మెంబెర్స్ అయ్యుంటే చాలు. 408 రూపాయలతో తొలి రీఛార్జ్ చేపించుకుంటే చాలు 1,999కే జియోఫై అందుబాటులో ఉంటుంది. కాకపోతే 1005 రూపాయల విలువైన 4జీ డేటాను మాత్రమే పొందడానికి అవకాశముంది. అంటే 1999 చెల్లిస్తే 1005 రూపాయల డేటా మాత్రమే పొందవచ్చు!

Comments

comments

Share this post

scroll to top