“రిలయన్స్ జియో” కస్టమర్లకు మరో శుభవార్త..! సంచలన నిర్ణయంతో ప్రత్యర్థులకు పెద్ద షాక్ ఇవ్వనుంది..?

టెలికాం సంస్థలో సంచలనం సృష్టిస్తుంది “జియో”. 6 నెలల వరకు ఉచిత డేటా, కాల్ సేవలు అందించడమే కాదు ఇప్పుడు అతితక్కువ ధరకే ఈ సేవలు అందించనున్నారు. ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆశ్చర్య పరుస్తూనే ఉంది జియో. డిసెంబర్ లో ముగించాల్సిన ఉచిత సేవలని “న్యూ ఇయర్” ఆఫర్ అని మార్చ్ 31 వరకు పొడిగించారు. ఇప్పుడు సరికొత్తగా “సమ్మర్ ఆఫర్” అని 303 రూపాయలకే ఈ సేవలను మూడు నెలల వరకు అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరోసంచలనంకి తెర తీసింది “రిలయన్స్ జియో”.

ఈ సారి ఉచిత కాల్స్, డేటా తో కాకుండా DTH మార్కెట్ లో అరంగేట్రం చేయనుంది. ఇప్పటివరకు సన్ డైరెక్ట్, టాటా స్కై, విడియోకాన్, ఎయిర్టెల్..ఇలా dth సర్వీసులను మనం వినియోగిస్తున్నాం. ఇప్పుడు వాటన్నిటికీ దిమ్మతిరిగిపోయే షాక్ ఇవ్వనుంది జియో. “జియో dth ” రానుంది. సెట్ టాప్ బాక్స్ ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యి సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ సెట్ టాప్ బాక్స్ కి పెన్ డ్రైవ్, ఆడియో వీడియో కేబుల్ మాత్రమే కాకుండా “బ్రాడ్ బ్యాండ్” కేబుల్ కూడా కనెక్ట్ చేయొచ్చు అంట!

 


జియో ఉచితంగా మూడు నెలలవరకు DTH సేవలు అందించనుంది అన్న వార్త మీడియా రిపోర్ట్స్ లో చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా 1 జీబీపీఎస్ స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కూడా అధనంగా రానుంది. ఫ్రీ ఆఫర్ అయిపోయిన తరవాత అన్ని DTH సేవలకంటే అతితక్కువ ధర కేవలం 180 రూపాయలు నెలకు మాత్రమే అంట. ఇందులో భాగంగా 300 నార్మల్ చానెల్స్, 50 హెచ్డీ చానెల్స్ ప్రసారమవుతాయట!

ఈ విషయంపై “రిలయన్స్” అమెజాన్ తో చర్చలు జరుపుతుంది అంట. జియో రిమోట్ కేవలం వాయిస్ ద్వారా కూడా పనిచేస్తుంది అంట! ఈ సర్వీస్ మొదటగా “ముంబై” లో మొదలయ్యి , తరవాత అన్ని నగరాలకు విస్తరించనుంది అని సమాచారం.

Comments

comments

Share this post

scroll to top