“రిలయన్స్ జియో” వినియోగదారులకు గుడ్ న్యూస్! “మార్చ్ 31 ” కి ఉచిత సేవలు ముగించట్లేదు! ఏప్రిల్ వరకు పొడిగింపు?

ప్రస్తుతం ఎంతో నెట్ ఉపయోగిస్తున్నాం అంటే దానికి కారణం రిలయన్స్ జియో అందించిన ఫ్రీ డేటా ఆఫర్..టీనేజ్ స్టూడెంట్స్ అయితే జియో ఒక కల్పవృక్షంలా భావించేస్తున్నారు..అదృష్టం బాగుంటే అప్పుడప్పుడు మనకి ఫ్రీ కాల్స్ కూడా కలుస్తూ ఉంటాయి…డిసెంబర్ 31 వరకు ఉన్న ఆఫర్ ని మార్చ్ 31 వరకు పొడిగించారు!…మరి 31 మార్చ్ తరవాత జియో వినియోగదారుల పరిస్థితి ఏంటి?…మార్చ్ 31 లోపు జియో కస్టమర్స్ అయిన వారందరికీ “జియో ప్రైమ్ మెంబర్షిప్” ఇవ్వనున్నట్టు “ముకేశ్ అంబానీ” అధికారికంగా ప్రకటించారు!…ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ తీసుకోవాలంటే రూ.99 చెల్లించాలి.

jio-prime-detail

ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఆఫ‌ర్ల‌తో క‌స్ట‌మ‌ర్ల‌ను అట్రాక్ట్ చేస్తున్న రిల‌య‌న్స్ జియో తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఏప్రిల్ 30 వరకూ ఈ మెంబర్ షిప్ ప్రోగ్రాంను పొడిగించాలని రిలయన్స్ జియో భావిస్తున్నట్లు టెలికాం వర్గాలు తెలిపాయి. రిలయన్స్ జియో వినియోగదారుల్లో కనీసం 50 శాతం మందినైనా ప్రైమ్ మెంబర్స్‌గా మార్చుకోవాలని జియో భావిస్తోంది. అయితే ఈ విషయంపై జియో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదేగానీ నిజమైతే జియో యూజర్లు మరో నెల పాటు ఉచిత ఆఫర్‌ను పొందే అవకాశముంది.

 

Comments

comments

Share this post

scroll to top