427 రూపాయ‌ల గ్యాస్ సిలిండ‌ర్ ను 158 రూపాయ‌ల‌కే..Jio లాంటి ఆఫ‌ర్ తో రెడీ అయిన రిల‌య‌న్స్!?

Jio సిమ్ ల‌తో……. బ్రాడ్ కాస్టింగ్ వ్య‌వ‌స్థ‌ను ఓ ఊపు ఊపుతున్న రిల‌యెన్స్ సంస్థ తాజాగా….గ్యాస్ సిలిండ‌ర్ల రంగంలో త‌న‌దైన ముద్ర వేయ‌డానికి రెడీ అవుతుంది. 427 రూపాయ‌ల గ్యాస్ సిలిండ‌ర్ ను 158 రూపాయ‌ల‌కే అందించాల‌నే ప్లాన్ తో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు స‌మాచారం. 5 కేజీలు, 14.2 కేజీలు, 19 కేజీల గ్యాస్ సిలిండ‌ర్ల‌ను అతి త‌క్కువ రేట్ల‌కే అందిస్తూ….గ్యాస్ వినియోగ‌దారుల‌ను పూర్తిగా త‌మ‌వైపుకు తిప్పుకునే ప్లాన్ లో ఉన్న‌ట్టు తెలుస్తుంది.

గ‌త సంవత్స‌రం ఈ విష‌యంపై పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ….ఇది ఇంకా కార్య‌రూపం దాల్చ‌లేదు…జియో సిమ్ ల‌తోనే స‌ద‌రు సంస్థ‌కు రావాల్సిన ప్ర‌చారం రావ‌డంతో …ఈ కార్య‌క్ర‌మాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. జీయో ఆఫ‌ర్ ముగియ‌గానే….ఈ ఆఫ‌ర్ తో మార్కెట్ లో మ‌రో మారు రిల‌య‌న్స్ పేరు మార్మోగి పోవాల‌నే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు క‌నిపిస్తుంది. అనేక చ‌మురు సంస్థ‌లు గ‌ల రిల‌య‌న్స్ కు ఈ నిర్ణ‌యం అంత అసాధ్య‌మేమీ కాదు..! మ‌రి ఇది ఎప్పుడు అమ‌లు అవుతుందో చూడాలి!

Comments

comments

Share this post

scroll to top