ఆసుపత్రులు, అంబులెన్స్‌లు, వైద్యుల కార్లపై ఎర్రని ప్లస్‌ (+) గుర్తు ఉంటుంది కదా? దాని అర్ధమేంటో తెలుసా.?

ఈ విషయాల గురుంచి చాలా మందికి అవగాహనా లేకపోవచ్చు, తెల్లని నేపథ్యంలో ఎర్రని ప్లస్‌ గుర్తు ఉంటే అది అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ సంస్థ చిహ్నం. కొందరు ప్లస్‌ చుట్టూ గుండ్రని వలయం గీస్తారు. అప్పుడది రెడ్‌క్రాస్‌ చిహ్నం కాదు. నాలుగుసార్లు నోబెల్‌ శాంతి బహుమతి పొందిన రెడ్‌క్రాస్‌ సంస్థ, స్విట్జర్లాండ్‌ దేశస్థుడైన హెన్రీ డునాంట్‌ యుద్ధ సైనికులకు చికిత్స చేసే విధానాలపై రాసిన పుస్తకం ప్రేరణగా కొందరు 1863లో జెనీవాలో స్థాపించినది.

అప్పట్లో తరచూ జరిగే యుద్ధాల్లో గాయపడిన సైనికులకు సేవచేసే వారిని గుర్తించి, ఎవరూ దాడి చేయకుండా ఉండడానికి ఈ చిహ్నం ఉపయోగపడేది. అదే నేడు ఆరోగ్య రంగానికి చిహ్నంగా మారింది. వాస్తవానికి చట్టపరంగా రెడ్‌క్రాస్‌ సంస్థకు చెందని వారు ఈ చిహ్నాన్ని వాడకూడదు, కానీ చాలా మంది వాడుతున్నారు.

తాగిన వ్యక్తిపై నీళ్లు కుమ్మరిస్తే మత్తు దిగిపోతుందని అంటారు. నిజమేనా? కచ్చితంగా తెలుసుకోవాలి..

తాగితే తూగడం, తూగాలని తాగడం. తాగుబోతులు తాగే ద్రావణంలో నీరు అధికంగానూ, ఇథైల్‌ ఆల్కహాలు కొద్దిగానూ ఉంటాయి. ఆల్కహాలు మోతాదునుబట్టి ఆయా పానీయాల మత్తు తీవ్రత ఆధారపడుతుంది. ఇథైల్‌ ఆల్కహాలుకు తనంత తానుగా మత్తును కలిగించే గుణం లేదు. తాగినప్పుడు ఏ జీర్ణ ప్రక్రియ అవసరం లేకుండానే కొద్దిసేపటికే రక్తంలో కలిసే గుణం దీనికి ఉంది.

రక్తంలో కలిసిన వెంటనే అది దేహంలోని కణ జాలాల్లోకి బాగా త్వరితంగా చేరుకోగలుగుతుంది. కణాల్లోకి వెళ్ళాక అది సాధారణంగా అసిటాల్డిహైడుగా మారుతుంది. సారాయి తాగిన వాళ్ల దగ్గర్నుంచి వెలువడే దుర్గంధం దీనిదే. ఇది మెదడు కణాల్లోని అమైనో ఆమ్లాలలో చర్య జరిపి మత్తును, కైపును కలిగిస్తుంది.

తీసుకున్న మోతాదును బట్టి ఆ తాగుబోతు ప్రవర్తన, శరీర క్షేమం ఆధారపడ్తాయి. సారాయి, అసిటాల్డిహైడ్‌ నీటిలో బాగా కరుగుతాయి. మత్తులో జోగుతున్న మనిషి మీద బకెట్టు నీళ్లు పోస్తే అవి బట్టలను తడపడం వల్ల చాలా సేపు చర్మం తేమగా ఉంటుంది కాబట్టి కనీసం చర్మంలో ఉన్న కణాల్లోని ఆల్కహాలు సంబంధిత రసాయనాలు బయటపడతాయి. ఒక్కసారిగా శరీర ఉపరితల ఉష్ణోగ్రత మారడం వల్ల కూడా ఆల్కహాలు ప్రభావం తగ్గుతుంది.

 

Comments

comments

Share this post

scroll to top