తన స్టార్ డమ్‌ను కోల్పోకుండా బ్యాలెన్స్‌గా మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తున్న అతికొద్దిమంది నటుల్లో తెలుగు సినిమా రంగంలో ప్రిన్స్ మహేష్ బాబు ఒక్కరే. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కోలివుడ్, టాలీవుడ్ , తమిళనాడు సినిమా పరిశ్రమలలో మహేష్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇండియాతో పాటు ఓవర్సీస్లో భారీగా ప్రిన్స్ సినిమాలకు డిమాండ్ ఉంటోంది. స్టార్ డమ్‌తో పాటు లో ప్రొఫైల్ మెయింటెనెన్స్ చేయడం ఆయనకే చెల్లింది. పూజా హెగ్డే ప్రధాన హీరోయిన్గా నటిస్తున్న మహర్షి సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన మహర్షి టీజర్‌కు ఊహించని రీతిలో రేటింగ్ లభించింది. కేవలం 24 గంటల్లో కోటి మందికి పైగా ఈ టీజర్ ను వీక్షించారు. ఇది మహేష్ కు ఉన్న స్టామినా ఏమిటో తెలుస్తుంది.
ఈ మూవీ పట్ల రోజు రోజుకు వ్యూవర్షిప్ పెరుగుతూ వస్తోంది. మహర్షి సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ సినిమా మార్కెట్‌తో పాటు ఓవర్సీస్ మార్కెట్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ప్రీ రిలీజ్ వేడుకకు సిద్ధమవుతున్న మహర్షి ప్రపంచ వ్యాప్తంగా మే 9న విడుదల కానున్నది. తాజాగా మహర్షి మూవీ రికార్డులను తిరగ రాస్తోంది. రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను అత్యధికంగా 47.50 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయి. డిజిటల్ రైట్స్ రూపంలో ఇంత భారీ మొత్తం రాబట్టిన చిత్రం బాహుబలి తర్వాత మహర్షి రికార్డు సృష్టించింది.
ఈ కామర్స్ దిగ్గజం అమెరికన్ కంపెనీ అమెజాన్ సంస్థ ఈ చిత్రాన్ని 11 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. శాటిలైట్ రైట్స్‌ను జెమిని టీవీ 14.5 కోట్ల రూపాయలకు చేజిక్కించుకుంది. మరో వైపు జీ, మా టీవీలు పోటీ పడినా అంచనాలకు మించి సినిమాను జెమిని ఎగరేసుకు పోయింది. తమిళనాట మహేష్ బాబుకు ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆడియో రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ కంపెనీ 2 కోట్ల రూపాయలకు దక్కించుకున్నాయి. హిందీ శాటిలైట్ , డబ్బింగ్ హక్కులు 20 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయి. ఇవక ఓవర్సీస్ రైట్స్‌ను గ్రేట్ ఇండియా ఫిల్మ్ సంస్థ 12.5 కోట్లకు దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా, ఓవర్సీస్ లలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీపై మహేష్ బాబు భారీ నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఎన్నడూ లేనంతగా మరింత అందంగా కనిపిస్తున్నారు మహేష్ బాబు.