వ‌ల‌స‌ల దేశం.. రెండో ప్ర‌పంచ యుద్దం త‌రువాత ఇదే రికార్డ్..

భూలోక స్వ‌ర్గ‌మంటూ ఈ దేశం ఎగిరొచ్చావా?.. పోలేక ఉండ‌లేక కంటి నీరై నిలిచావ అంటూ ఓ క‌వి రాసిన రాత‌లు అక్ష‌ర సత్యాల‌వుతున్నాయి. కుటుంబ బాధ్య‌త‌ల కోసం.. ఆర్థిక ఇబ్బందులు దాటేందుకు ఉన్న ఊరుని, క‌న్న‌త‌ల్లిని వ‌దులుకుని ప‌రాయి దేశం వెళుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అయితే ఇందులో బ్రతుకు దెరువు కోసం కాక ప్రాణాల‌ను కాపాడుకునేందుకు ఇత‌ర దేశాల‌కు వెళుతున్న వారి సంఖ్య పెరుగుతుంద‌ని స‌ర్వేలు చెపుతున్నాయి. అయితే ఈ రెండేళ్లల చోటు చేసుకున్న వ‌ల‌స‌ల లెక్క‌తో ఐక్య‌రాజ్య స‌మితే ఆశ్చ‌ర్య పోయింది.

Sikh carrying his wife on his shoulders as he walks with others migrating to their new homeland after the creation of Sikh and Hindu section of Punjab India due to the division of India.

ప్రపంచవ్యాప్తంగా ఆరున్నర కోట్ల మంది ప్రజలు సొంత దేశాల నుండి ప‌రాయి దేశానికి వలస వెళ్లారంటా.. రెండో ప్రపంచ యుద్ధం త‌రువాత ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు స్థానభ్రంశం చెందటం ఇదే మొదటిసారని ఐక్యరాజ్యసమితి శ‌ర‌ణార్థుల‌ సంస్థ అయిన‌ యూఎన్హెచ్సీఆర్ ఓ నివేదికలో పేర్కొంది. వీరి సంఖ్య ప్ర‌పంచ జనాభాలో 0.8 శాతం గా ఉంద‌ని తెలిపింది. వ‌ల‌స వెళ్లిన మొత్తం జనాభా.. ఫ్రాన్స్ తో స‌మాన‌మంటా. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల జనాభా మొత్తం కలిపితే ఎంత ఉంటుందో అంత మంది జ‌నాభా వివిధ కార‌ణాల రిత్యా వ‌ల‌స వెళ్లార‌ని ఐక్య‌రాజ్య స‌మితి వెళ్ల‌డించింది. ఒక్క 2015 సంవత్సరంలోనే 58 లక్షల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వలస వెళ్లాగ.. ఇందులో పెద్ద‌ల కంటే పిల్ల‌లే ఎక్కువ‌గా ఉన్నార‌ని పేర్కోంది.

1442324724syrianrefugees-1170x740

అయితే ఎక్కువ వ‌ల‌స‌లు వెళుతున్న ప్ర‌జ‌లు సిరియా ప్రాంతానికి చెందిన వార‌ని స‌మాచారం. వీరంతా మ‌ధ్య ప్రాచ్య ప్రాంతానికి వ‌ల‌స వస్తున్నార‌ని తెలిపింది. ఇక్క‌డ‌ ప్రతి 20 మందిలో ఒకరు వలస వచ్చిన వారే ఉంటున్నారు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వలసవెళ్లిన‌ వారిలో ప్రతి 5 పౌరుల్లో ఒకరు సిరియన్ ఉన్నార‌ని తెలిపింది. అయితే శ‌ర‌ణార్థుల‌కు అధికంగా ఆశ్ర‌యం క‌లిపించిన దేశం మాత్రం టర్కీ.. గతేడాది 25 లక్షల మంది శరణార్థులకు ఈ దేశానికి ఆశ్రయం కోసం వ‌చ్చారని స‌మాచారం. శ‌రణార్థుల‌కు ఆశ్ర‌యం కల్పించ‌డంలో భార‌త్ చివ‌రి వ‌రుస‌లో ఉందంటా..?

Comments

comments

Share this post

scroll to top