కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సినిమాకు ఏమైందీ?

ఓ యువకుడు శనివారం ఆన్ లైన్ సైట్లో  కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సినిమా టికెట్ కోసం వెతికాడు కానీ అతనికి నిరాశే ఎదురైంది, ఇక ఆదివారం నాడు, తన గర్ల ఫ్రెండ్ ను బైక్ మీద ఎక్కించుకొని హైద్రాబాద్ లోని థియేటర్లన్నీ  బైక్ టైర్లు అరిగేలా తిరిగాడు, కానీ అతనికి మళ్లీ నిరాశే ఎదురైంది? ఎందుకంటే అతను అంతకు ముందే తన గర్ల్ ఫ్రెండ్ కు మంచి ఫీల్ గుడ్ మూవీ చూపిస్తానని హామీ ఇచ్చాడు. అతని ప్రకారం కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమా చూపిస్తే తను తన గర్ల ఫ్రెండ్ కు ఇచ్చిన ప్రామిస్ సక్సెస్ అయ్యినట్టే.

only bahubali

కానీ  శుక్రవారం నుండి సోమవారం వరకు ఆన్ లైన్ టిక్కెట్లను బుక్ చేసుకుందామని చూసిన వాళ్లందరికీ స్క్రీన్ మీద రెండు సినిమాలే కనిపించాయి, హైద్రాబాద్ లోని చాలా థియేటర్లలో బాహుబలి సినిమా దానితో పాటు మరో తెలుగు  సినిమా మాత్రమే ఆడింది. వాటికి మినహా మరే తెలుగు సినిమా కూడా స్క్రీన్స్ పై కనపడలేదు.  బాహుబలి అంటే కొత్త సినిమా దానికి తోడు రాజమౌళి అండ్ కో మూడేళ్లు కష్టపడితీసారు, అంతకు మించి సాంకేతిక అంశాలు ఉన్న సినిమా ఇది అందరూ ఒప్పుకుంటారు, కానీ కేవలం దాని కోసమే ఇతర సినిమాలు థియేటర్లలో లేకుండా పోవాల్సిందేనా? అంటే ప్రతిభ ఉన్న ఇతర డైరెక్టర్ల సినిమా కు థియేటర్లు దొరకవా ? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయ్.

kki

 

బాహుబలి తో పాటు థియేటర్ల లో కనిపించిన మరో  సినిమా కేరింత… వాస్తవానికి కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమాకి కేరింత కంటే మంచి రేటింగ్సే ఇచ్చారు క్రిటిక్స్.  అయినప్పటికీ కేరింత సినిమా థియేటర్లలో ఉంది, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ మాత్రం షేడ్ అవుట్ అయ్యింది.దీంతో అసహనానికి గురయ్యాడు సదరు యువకుడు. మనం  చూడాలనుకున్న సినిమా చూపిస్తారా? లేక వారు ఏ సినిమా చూపిస్తే మనం అది చూడాలా అనే ప్రశ్నను లేవనెత్తాడు.

ఈ విషయం పై దిల్ రాజు పై ఆరోపణలు వస్తున్నాయ్, కేరింత సినిమా కు ప్రొడ్యూసర్  దిల్ రాజ్ , దీనికి తోడు బాహుబలి నైజాం డిస్ట్రిబ్యూటర్ కూడా ఆయనే కావడం ఆయనపై వస్తున్నఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయ్.

CLICK: బాహుబలి పార్ట్ 1 కు 10 ప్రశ్నలు!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top