అప్పుడే పుట్టిన బిడ్డ ఎందుకు ఏడుస్తుందో మీకు తెలుసా?

అప్పుడే పుట్టిన బిడ్డ ఎందుకు ఏడుస్తుందో మీకు తెలుసా? అంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుంది. అయితే ఈ మెసేజ్ లో 100%  శాస్త్రీయత లేనప్పటికీ … లోకం తీరును మాత్రం కళ్ళకు కట్టినట్టు చూపే ప్రయత్నం చేశారు దీనిని క్రియేట్ చేసిన వారు.

ఓ బిడ్డ పుట్టగానే ఎందుకు ఏడుస్తుంది అంటే……..
అమ్మ కడుపులో ఉన్న ఆ 10 నెలలు లయబద్ధకంగా వినపడే గుండె చప్పుడును
వింటూ తన్మయం చెందుతూ ఉంటుంది…….ఆ చప్పుడులో తనను తాను
మరచిపోయి ఆ చప్పుడే తనకు రక్షణగా భావిస్తూ ఉంటుంది…
బయటి ప్రపంచంలోకి రాగానే ఆ చప్పుడు దూరమై తనకు ఏదో అవుతోంది
అని భయంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆ బిడ్డ,,,,,,,,,ఆ ఏడుపు ఆ తల్లి
ఒడిలోకి చేరగానే ఆపేస్తుంది గమనించండి…….తల్లి తనను దగ్గరకు
తీసుకోగానే మళ్ళి ఆ గుండె చప్పుడు విని తనకు ఏమీ భయం లేదని
ఆ బిడ్డకు తెలిసిపోతుంది…….
నిజంగా తల్లిమీద ఆ పసికూనకు ఎంత నమ్మకమో కదా! అమ్మ ప్రేమకు
అనురాగానికీ సాటి లేదు…….చివరికి తన గుండె చప్పుడు కూడా ఆ బిడ్డకే!

Comments

comments

Share this post

scroll to top