ఆడవారికి ఎడమకన్ను,మగవారికి కుడికన్ను అదిరితే మంచిదా..దాని వెనుక ఉన్న కథ ఏంటి? కళ్లు అదరడానికి కారణాలు తెలుసుకోండి.

ఆడవారికి ఎడమకన్ను అదిరితే మంచిదని..మగవారికి కుడి కన్ను అదిరితే చెడు అని అనడం మనం వింటుంటాం…మనకి వాస్తు శాస్త్రం లానే శకున శాస్త్రం కూడా వున్నది.  దాని ప్రకారం మన కన్నే  కాదు మగవారికి కుడివైపు శరీర భాగం, ఆడవారికి ఎడమ వైపు శరీర భాగం అదిరితే మంచిదంటారు. దీనివెనుక  రామాయణానికి సంభందించి ఒక కధ చెప్తారు.  శ్రీరామచంద్రుడు వానర సేనని తీసుకుని రావణుడి మీద యుధ్ధానికి బయల్దేరినప్పుడు రావణాసురుడికి ,సీతమ్మవారికి ఎడమ కన్ను అదిరాయట.  సీతమ్మవారికి ఎడమ కన్ను అదిరిన ఫలితం కనిపించింది రాముడు సీతను రావణాసురుడి  చెరనుంచి విడిపించాడు.  అలాగే రావణాసురుడుకి కీడు జరిగింది.

ప్రతిసారి శరీర భాగాలదిరినప్పుడు మనకి అనుకూలమైన సూచన అయితే ఏదో మంచి జరుగుతుందని కానప్పుడు ఏదో కీడు జరుగుతుందని అనుకోవడానికి లేదు.కేవలం కొన్ని సార్లు మాత్రమే అదిరితే అది శకునం కావచ్చు.

వాస్తవానికి మన శరీర భాగాలు అదరడానికి కారణాలు

  1. కొందరు ఉదయం నుండీ రాత్రిదాకా అదిరిందంటారు, కొందరికి శరీర భాగాలు తరచూ అదరవచ్చు…అది నరాల బలహీనతకు సూచన.
  2. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వాత, పిత్త గుణాలు ప్రకోపించినప్పుడు శరీరంలో భాగాలు అదురుతాయంటారు.
  3. కళ్ళ వ్యాధులున్నాకూడా కంటి భాగాలు తరచూ అదరవచ్చు. అలాంటప్పుడు డాక్టరుని సంప్రదించాలిగానీ నమ్మకాలని పట్టుకుని వేళ్ళాడకూడదు.

 

Comments

comments

Share this post

scroll to top