విరాట్ కోహ్లీ మొన్నటి మ్యాచ్ లో “డకౌట్” అవ్వడానికి ఈమెనే కారణం తెలుసా..? ఎలాగంటే..!

ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. ప్రాక్టీస్ మ్యాచ్ లలో అదరకొట్టారు టీం ఇండియా. పాకిస్తాన్ తో మొదటి మ్యాచ్ తో గెలిచి శుభారంభం చేసారు. కానీ రెండో మ్యాచ్ లో శ్రీలంకతో అనుకోని ఓటమి రుచి చూసారు. 300 కు పైగా పరుగులు చేసినా కూడా ఓడిపోయారు టీం ఇండియా. రోహిత్, ధోని అర్ధ శతకాలు చేయగా..ధావన్ శతకంతో ఆకట్టుకున్నాడు. కానీ శ్రీలంక ఆటగాళ్లు అద్భుతంగా బాటింగ్ చేసి విజయం సాధించారు. ఇది ఇలా ఉండగా…ధోని అర్ద శతకం చేసినందుకు ఫాన్స్ సంబరపడ్డారు. కానీ కోహ్లీ డక్ అవుట్ అయినందుకు అందరు నిరాశపడ్డారు.

అయితే దీనిపై ట్విట్టర్ లో ఓ సరికొత్త విషయం సంచలనం అవుతుంది. పాకిస్తాన్‌ స్పోర్ట్స్ ఎనలిస్టు జైనాబ్ అబ్బాస్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. బుధవారం పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కి ముందు జైనాబ్ దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌తో సెల్ఫీ దిగింది. అంతే… బౌలర్లను చీల్చి చెండాడగల డివిలియర్స్ ఒక్కదెబ్బతో డకౌట్ అయ్యాడు. 12 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో అతడు డకౌట్ అవ్వడం ఇదే తొలిసారి!

సరిగ్గా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి ముందు ఈ అమ్మడు విరాట్ కోహ్లీతో కూడా సెల్ఫీ దిగింది. అయితే ఆ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి 81 పరుగులు చేసిన కోహ్లీ… ఆ వెంటనే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. గత మూడేళ్లలో కోహ్లీ ఇలా డకౌటవ్వడం ఇదే మొదటిసారి! మరో విశేషమేంటంటే… ఈ ఇద్దరు కెప్టెన్లు డకౌట్ అయిన మ్యాచుల్లో సదరు రెండు జట్లూ ఓడిపోయాయి.

ఈ రెండు సంఘటనలను పోల్చుతూ నెటిజన్లు ట్విటర్లో చెలరేగిపోతున్నారు. అయితే ఆ కామెంట్లను లైట్ తీసుకున్న ఆమె సరదాగా నవ్వుతూ రిప్లై ఇస్తోంది. ఇక పాకిస్తాన్ క్రికెట్ అభిమానులైతే… జైనాబ్ సెల్ఫీలపై తెగ సంబరపడుతున్నారట. చూడబోతే శ్రీలంక ఆటగాళ్లతో కూడా సెల్ఫీ దిగమని బతిమాలేటట్టు ఉన్నారు. సెమీ ఫైనల్‌ బెర్తు కోసం సోమవారం శ్రీలంక, పాకిస్తాన్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే.

 

Comments

comments

Share this post

scroll to top