శరీరంలో ఎక్కడ వాపొస్తే..యే హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నట్లో తెలుసా?

మ‌న‌కు ఎప్పుడు ఏ అనారోగ్యం క‌లిగినా అంత‌కు ముందే దానికి సంబంధించిన కొన్ని ల‌క్ష‌ణాలు మ‌న దేహంలో క‌నిపిస్తాయి. వాటిని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి అందుకు త‌గిన విధంగా ప్ర‌వర్తిస్తే ముందు ముందు క‌లిగే తీవ్రమైన వ్యాధుల‌ను త‌గ్గించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌న శ‌రీరంలో ఆయా భాగాల్లో అప్పుడ‌ప్పుడు క‌నిపించే వాపులే ఇలాంటి తీవ్ర‌మైన అనారోగ్యాల‌కు ముందస్తు సూచ‌న‌లు. ఆయా అవ‌య‌వాల్లో క‌లిగే వాపుల‌ను ముందుగానే ప‌సిగ‌ట్టి దానికి త‌గిన విధంగా స్పందించే మ‌నం ఏ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నామో ఇట్టే తెలిసిపోతుంది. దీంతో ఆ అనారోగ్యాన్ని త‌గ్గించుకునేందుకు కూడా వీలు క‌లుగుతుంది. ఈ క్ర‌మంలో అస‌లు శ‌రీరంలో ఏయే భాగాల్లో వాపులు వ‌స్తే దాని వ‌ల్ల మ‌నం ఎలాంటి అనారోగ్యాల‌తో బాధ‌ప‌డుతున్నామో, దాన్ని గురించి ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం…

body-parts-swelling

1. గ‌జ్జ‌ల్లో వాపులు క‌నిపిస్తే ఏదో ఒక ఇన్‌ఫెక్ష‌న్‌తో మ‌నం బాధ‌ప‌డుతున్నామ‌ని అర్థం చేసుకోవాలి. సాధార‌ణంగా ఈ ఇన్‌ఫెక్ష‌న్ లైంగిక సంబంధాల వ‌ల్ల వ‌స్తుంటుంది. ఈ క్ర‌మంలో వైద్యున్ని సంప్ర‌దిస్తే త‌క్ష‌ణ‌మే అందుకు త‌గిన చికిత్స తీసుకోవ‌చ్చు.

2. కాళ్ల‌ల్లో వాపులు వ‌స్తే గుండె, లివ‌ర్ సంబంధ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. శ‌రీరంలో అధికంగా ఉన్న నీటిని క‌ణ‌జాలాలు శోషించుకోవ‌డం వ‌ల్ల ఇలా కాళ్లు వాపుల‌కు గుర‌వుతాయి. డైయురెటిక్స్ వంటి మందులు వాడి ఈ అనారోగ్యాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. కానీ వైద్యున్ని సంప్ర‌దిస్తే మంచిది.

3. మగ‌వారికి వృష‌ణాల్లో వాపులు వ‌స్తే వైర‌ల్ లేదా బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చింద‌ని తెలుసుకోవాలి. ఇది గ‌నేరియా లాంటి ఎస్‌టీడీ సంబంధ వ్యాధి అయి ఉండేందుకు అవ‌కాశం ఉంది.

4. ముఖమంతా వాపు వ‌చ్చి ఉబ్బిన‌ట్టు ఉంటే శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గురైంద‌ని తెలుసుకోవాలి. అంతేకాకుండా ప‌లు మందులు ప‌డ‌క‌పోయినా, వాతావ‌ర‌ణంలో మార్పులు వ‌చ్చినా, ప‌డ‌ని ఆహార ప‌దార్థాలు తిన్నా, థైరాయిడ్ వంటి వ్యాధులు ఉన్నా ముఖం వాపుకు గుర‌వుతుంటుంది.

5. ద‌వ‌డ‌లు వాపుల‌కు గురైతే స్థూల‌కాయం ఉన్న‌ట్టు లెక్క‌. ప‌లు దంత ఇన్‌ఫెక్ష‌న్ల కార‌ణంగా కూడా ద‌వ‌డ‌లు అప్పుడ‌ప్పుడు ఉబ్బుతాయి.

6. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, ఐబీఎస్ వంటి వ్యాధుల‌తో బాధ‌ప‌డుతుంటే పొట్ట ఉబ్బ‌డం, వాయ‌డం జ‌రుగుతుంది. త‌క్ష‌ణ‌మే వైద్యున్ని సంప్ర‌దించి త‌గిన చికిత్స తీసుకోవాలి.

7. చేతుల్లో వాపులు వ‌స్తే డీహైడ్రేష‌న్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు లెక్క‌. ఉప్పు ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల కూడా చేతులు ఉబ్బుతాయి. ప‌లు సింపుల్ ఎక్స‌ర్‌సైజ్‌లు, మ‌సాజ్‌లు చేయ‌డం వ‌ల్ల చేతుల వాపును త‌గ్గించ‌వ‌చ్చు.

8. బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల కార‌ణంగా చెవులు వాపుల‌కు గుర‌వుతాయి. పుర్రె ఎముక‌లో ఇన్‌ఫెక్ష‌న్‌, దుర‌ద‌, గ‌జ్జి వంటి స‌మ‌స్య‌లు ఉన్నా చెవులు వాపుకు గుర‌వుతుంటాయి.

9. ప‌లు ర‌కాల ప‌డ‌ని ఆహార ప‌దార్థాలు తిన్నా, మందుల‌ను మింగినా నాలుక వాపుకు గుర‌వుతుంది. దీని వ‌ల్ల శ్వాస స‌రిగా ఆడ‌క‌పోవ‌చ్చు. త‌క్ష‌ణ‌మే డాక్ట‌ర్‌ను సంప్రదించి త‌గిన చికిత్స తీసుకోవాలి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top