“ఆంధ్ర ప్రదేశ్” ప్రభుత్వం అంత సడన్ గా “నంది అవార్డుల” జాబితా ఎందుకు ప్రకటించిందో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రెస్టీజియస్ అవార్డు అంటే “నంది అవార్డు” అంటారు!…2012 , 2013 లో ఉత్తమ ప్రదర్శనకి గాను “నంది అవార్డు” అందుకున్న వారి లిస్ట్ అనుకోకుండా నిన్న విడుదల అయ్యింది…”ఈగ, ఏటో వెళ్ళిపోయింది మనసు” సినిమాలు అవార్డులు గెలుచుకోవడంలో పోటాపోటీ పడ్డాయి!…ప్రభాస్, నాని బెస్ట్ హీరో అవార్డు గెలుచుకున్నారు…

>>> 2012 , 2013 నంది అవార్డ్స్ గెలుచుకుంది ఎవరో తెలుసా?…క్లిక్ చేసి విన్నెర్స్ లిస్ట్ చూడండి! <<<


నార్మల్ గా “నంది అవార్డ్స్” అంటే ఎంతో క్రేజ్ ఉంటది…కానీ అవార్డు గెలుచుకున్న సినిమాలు వచ్చి ఎన్నో ఏళ్ళు అవ్వడంతో ఆడియన్స్ అంతగా పట్టించుకోలేదు…కానీ ఇంత సడన్ గా నంది అవార్డులు ప్రకటించడానికి అసలు కారణం ఏంటి అంటే…నంది అవార్డులను “ఆంధ్ర ప్రదేశ్” ప్రభుత్వం ఇస్తుంది…అయితే “నంది అవార్డు” కి దీటుగా “తెలంగాణ” ప్రభుత్వం “సింహ” అవార్డ్స్ ఇవ్వనుంది…ఈ ప్రక్రియ పూర్తి అవ్వడానికి స్పెషల్ కమిటీని కూడా వేసింది…అది తెలుసుకున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెంటనే “నంది అవార్డుల” జాబితా ప్రకటించేసింది!…

ఇప్పుడు సినీ వర్గాల దృష్టి అంత “సింహ అవార్డ్స్” పైనే ఉంది…మరి ఎవరు గెలుచుకోనున్నారో వేచి చూడాలి!…2012 , 2013 లో నంది అవార్డ్స్ ఎవరు గెలుచుకున్నారో చూడండి!

నంది అవార్డుల జాబితా -2012 సంవత్సరం

ఉత్తమ చిత్రం (2012 )- ఈగ
ఉత్తమ రెండో చిత్రం- మిణుగురులు
ఉత్తమ మూడో చిత్రం – మిధునం
ఉత్తమ దర్శకుడు రాజమౌళి -(ఈగ)
ఉత్తమ నటుడు- నాని(ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ పాపులర్ చిత్రం- జులాయి
ఉత్తమ విలన్- సుదీప్ (ఈగ)
ఉత్తమ నటి -సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ సహాయనటుడు- అజయ్ (ఇష్క్)
ఉత్తమ సంగీత దర్శకుడు- కీరవాణి (ఈగ) మరియు ఇళయరాజా ( ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ కొరియోగ్రాఫర్- జానీ (జులాయి)
ఉత్తమ ఆడియోగ్రాఫర్- కడియాల దేవి కృష్ణ (ఈగ)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ -మకుట (ఈగ)
ఉత్తమ మాటల రచయిత- తనికెళ్ళ భరణి(మిథునం)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – తిరుమల (కృష్ణం వందే జగద్గురం)
ఉత్తమ ఫైట్ మాస్టర్ -గణేష్ (ఒక్కడినే)
ఉత్తమ నటుడు (స్పెషల్ జ్యూరీ అవార్డ్) – బాల సుబ్రహ్మణ్యం
ఉత్తమ నటి (స్పెషల్ జ్యూరీ అవార్డ్) -లక్ష్మీ
ఉత్తమ నేపథ్య గాయకుడు – శంకర్ మహదేవన్ (షిర్డీ సాయి)
ఉత్తమ నేపథ్య గాయని -గీతా మాధురి

నంది అవార్డులు-2013

ఉత్తమ చిత్రం – మిర్చి
ఉత్తమ రెండో చిత్రం – నా బంగారు తల్లి
ఉత్తమ మూడో చిత్రం – ఉయ్యాల జంపాలా
ఉత్తమ కుటుంబ కథా చిత్రం – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం – భారత కీర్తి మూర్తులు
ఉత్తమ డాక్యుమెంటరీ రెండో చిత్రం- సప్త వ్యసనాలు
ఉత్తమ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ – విన్నర్
ఉత్తమ నటుడు – ప్రభాస్ (మిర్చి)
ఉత్తమ నటి – అంజలీ పాటిల్ (నా బంగారు తల్లి)
ఉత్తమ దర్శకుడు – దయా కొడవగంటి
ఉత్తమ సహా నటుడు ప్రకాశ్ రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
ఉత్తమ కమెడీయన్ – తాగుబోతు రమేష్ ( వెంకటాద్రి ఎక్స్ ప్రెస్)
ఉత్తమ మెయిల్ సింగర్ – కైలాష్ కె (మిర్చి)
ఉత్తమ విలన్ – సంపత్ రాజ్ (మిర్చి)
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ – విజయ సింహారెడ్డి ( భక్త సిరియాళ)
ఉత్తమ తొలి చిత్రం దర్శకుడు – కొరటాల శివ (మిర్చి)
ఉత్తమ కథా రచయిత – ఇంద్రగంటి మోహన్ కృష్ణ
ఉత్తమ పాటల రచయిత – సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఉత్తమ సంగీత దర్శకుడు – దేవి శ్రీ ప్రసాద్ ( అత్తారింటికి దారేది)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ – కాళీచరణ్
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత- మేర్లపాక గాంధీ ( వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ )

 

Comments

comments

Share this post

scroll to top