మా ఎన్నికల్లో ఓటు వెయ్యకుండా ఎగ్గొటిన స్టార్ హీరో లు.? కారణమేంటంటే…!!

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మా అసోసియేషన్ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను తలపించేలా సాగాయి, శివాజీ రాజా పైన యాక్టర్ నరేష్ విజయం సాధించి ‘మా’ అసోసియేషన్ కి అధ్యక్షుడు అయ్యాడు. అయితే ఈ మా అసోసియేషన్ ఎన్నికల్లో స్టార్ హీరో లు చాలా మంది ఓటు వెయ్యలేదు, మెగా స్టార్ చిరంజీవి గారు ఆయన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కింగ్ నాగార్జున గారు కూడా ఓటు వేశారు.

ఆ ఇద్దరు తప్ప.. :

మా ఎన్నికల్లో మెగా స్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున గారు తప్ప మిగిలిన స్టార్ హీరోలెవరు ఓటు వెయ్యడానికి రాలేదు, బడా హీరోలు మా ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి ఎందుకు దూరంగా ఉన్నారో చాలా మందికి అర్ధం కాలేదు, సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా వచ్చి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు మా ఎన్నికల్లో.

కారణం ఇదేనా.?

ఈ సారి మా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి. నరేష్ ప్యానెల్, శివాజీరాజా ప్యానెల్ ఒకరి మీద ఒకరు ఆరోపణలతో హోరెత్తించారు, ఇది స్టార్ హీరో లకి నచ్చకపోడంతోనే వారు మా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదని సమాచారం, మహేష్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్ వారి మద్దతుని తెలిపారు కానీ ఓటు మాత్రం వెయ్యలేదు. అసలు కారణం కచ్చితంగా ఏంటి అని ఎవ్వరు చెప్పలేకపోయినా, మా ఎన్నికల్లో ఇరువర్గాల కొట్లాటల వలనే ఓటు హక్కు వినియోగించుకోడానికి రాలేదని అర్ధమవుతుంది.

ఎన్నికల్లో నరేష్, రాజశేఖర్ విజయం సాధించిన తరువాత మీడియా తో మాట్లాడారు.

నరేష్ మాట్లాడుతూ.. :

నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నాకు సహకరించిన మా చెల్లి జీవిత, మరియు బావ రాజశేఖర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా, తల్లి తండ్రులని పెద్దలను గౌరవించే వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు, నేను గెలుస్తా అని నాకు నమ్మకం ఉంది, అనుకున్నట్టుగానే గెలిచాను. చిరంజీవి, నాగార్జున, నాగబాబు మా ప్యానెల్ కు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు. మా అమ్మ విజయ నిర్మల, మరియు సూపర్ స్టార్ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. నాకు 50 ఓట్లు కూడా రావన్నారు శివాజీరాజా, కానీ నేను ఇప్పుడు గెలిచాను. అందరం కలిసి పనిచేస్తాం, మిత్రుడు శివాజీరాజా కి కూడా చెబుతుంది అదే, ఆ ప్యానెల్ ఈ ప్యానెల్ అని లేకుండా, ‘మా’ అసోసియేషన్ కోసం అందరం కలిసి పనిచేస్తాం, ఈ ఒక్కసారి మాత్రమే ‘మా’ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉంటా అని ప్రమాణం చేస్తున్నా.

Comments

comments

Share this post

scroll to top