“బిగ్ బాస్” లో “శివబాలాజీ” గెలవడం వెనుక ఇంత కథ నడిచిందా.? ఈ 5 విషయాలు గమనించండి.!

‘బిగ్ బాస్’ షో చాలా బాగుందని, ఈ షో విజేతగా తాను నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉందని శివబాలాజీ లాస్ట్ వర్డ్స్ చెప్పాడు. ‘బిగ్ బాస్’ ట్రోఫీని, రూ.50 లక్షల ఫ్రైజ్ మనీని అందుకున్న అనంతరం శివబాలాజీ మాట్లాడుతూ, ‘నేను విజేతగా నిలుస్తానని అనుకోలేదు. ఈ షో నుంచి మధ్యలో వెళ్లిపోతానని అనుకున్నాను.. నా కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా మంచి వ్యక్తులు. వాస్తవం చెప్పాలంటే వాళ్ల వల్లే నేను ఇంత ప్రశాంతంగా ఈ షోలో ఉండగలిగాను. నేను సాధించిన ఈ విజయంలో వాళ్ల పాత్ర కూడా ఉంది.. ఈ షో ద్వారా కంటెస్టెంట్ లందరూ చాలా క్లోజ్ అయిపోయారు నాకు. ఎంత క్లోజ్ గా అంటే నా బాల్య మిత్రుల లాగా. ఆడియన్స్ ఇంత సపోర్ట్ ఇస్తారని నేను ఊహించలేదు. ఇంటింటికీ, పేరు పేరునా ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సో మచ్. పిల్లలకు నా ముద్దులు.. థ్యాంక్యూ సో మచ్’అని చెప్పాడు.

70 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ షో ఫైనల్ ఆదివారం జరిగింది. ఈ షో ఫైనల్ విన్నర్ కోసం బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా చూసిన ఎదురు చూపులకు తెర పడింది. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి ఒక్కొక్కరిగా పార్టిసిపెంట్స్ అంతా ఎలిమినేట్ అవుతూ చివరకు శివబాలాజీ, ఆదర్శ్ మిగిలారు. వాళ్లిద్దర్నీ ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌస్ నుంచి స్టేజ్ పైకి తీసుకొచ్చి బిగ్‌బాస్ సీజన్1 ఫైనల్ విన్నర్ ని ప్రకటించారు. ఆయనే శివబాలాజీ. 3 కోట్ల 34 లక్షల 3 వేల 154 ఓట్లతో విన్నర్‌గా నిలిచారు. అయితే బిగ్ బాస్ మొదటి నుంచీ బల్ల గుద్ది మరీ చెబుతున్నట్లు ఈ విన్నర్ ని నిజంగా ప్రేక్షకుల ఓట్లే నిర్ణయించాయా?

  • అసలు ముందు వరకు హరితేజ లీడింగ్ లో ఉంది అన్నారు. కానీ సడన్ గా తారుమారు అయ్యింది. మరీ తర్వాత స్థానంలో కూడా హరితేజ నిలువలేదు. ఆదర్శ్ నిలిచాడు. అంటే హరితేజ ఓట్లకు దూరమైందా?
  • సోషల్ మీడియాలో చాలా మంది ఏమంటున్నారు అంటే..”కాటంరాయుడు” లో పవన్ కళ్యాణ్, శివ బాలాజీ నటించారు కదా. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉందని. పవన్ కళ్యాణ్ ఫాన్స్ అంత కలిసి ఓట్ల కాంపెయిన్ చేసారని అంటున్నారు.
  • అదీ కాక…శివబాలాజీ భార్య మధుమిత కూడా మొదటి నుండి సోషల్ మీడియాలో ఆక్టివ్ గ ఉంటూ..ఫొటోస్ పెడుతూ భర్తకి ఓట్లు వచ్చేలా కాంపెయిన్ చేసారు.
  • నవదీప్ కూడా మంచి పోటీ ఇచ్చాడు. కానీ వైల్డ్ ఎంట్రీ కార్డు అతనికి నెగటివ్ అయ్యింది.
  • కోపం, పెద్దరికం, హౌజుమేట్లతో వ్యక్తిగతంగా హుందాతనం నిండిన ప్రవర్తన తన ప్లస్ పాయింట్స్
  • ఆదర్శ్ కంటే హరితేజ బాగా ఎంటర్టైన్ చేసింది అని ఆడియన్స్ అంటున్నారు. మరీ ఆదర్శ్ సింపుల్ గా ఉండటం వల్లే అతనికి ఓట్లు పడ్డాయా?

Comments

comments

Share this post

scroll to top