“గోవా”లో సింపుల్ గా పెళ్లి చేసుకోవడం వెనకున్న అసలు కారణం ఇదే..! పేరు మార్చుకున్న “సమంత” ఏమన్నారో తెలుసా.?

Krishna

గత వారం రోజులుగా అటు మీడియాకి కానీ,ఇటు అభిమానులలో గానీ ఒకటే వార్త …అదే చై,సామ్ ల పెళ్లి.సెలబ్రిటీల పెళ్లిల్లు జరగడం కామన్,వాటి గురించి వార్తలు రావడం కామనే..కానీ సమంతా,చైతన్య పెళ్లి గురించి వార్తలు,ట్రొల్స్ లెక్కలేనన్ని రావడమే న్యూస్.ఇవాల్టికి కొంచెం ఆ హడావిడి తగ్గిందనుకుంటే…ఇప్పుడు ఇంకొక వార్త..సమంతా చైతన్య అంత సింపుల్ గా పెళ్లెందుకు చేసుకున్నారు అనీ…

నిజమే అందరికి దూరంగా ఎక్కడో గోవా సముద్ర తీరాన..కేవలం మూడంటే మూడు కుటుంబాలు.. దగ్గుబాటి,అక్కినేని,సమంతా ఫ్యామిలీలు… మొత్తం కలిపి వందమంది అతిధుల మధ్యే వీరి పెళ్లి గణంగా జరిగింది.మెహెందీ ఫంక్షన్,హిందూ సంప్రదాయ పద్దతిలో మరియు క్రిస్టియన్ పద్దతిలో జరిగిన పెళ్లి వేడుకను ఆద్యంతం ట్విటర్ ద్వారా పంచుకున్నారు సమంతా,నాగార్జున,వెంకటేశ్..ప్రతి ఒక్కరూ వేడుకకు సంభందించిన ప్రతి అంశాన్ని ట్వీట్ చేస్తున్నే ఉన్నారు..మామూలు జనం నుండి సెలబ్రిటీల వరకు వీరి పెళ్లి గురించి మాట్లాడుకున్నారు …అందరికి అంతుపట్టని విషయం ఏంటంటే సమంతా ,చైతన్య అంత సింపుల్ గా పెళ్లెందుకు చేసుకున్నారు అన్నది..దీనికి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇచ్చింది సమంత.

‘‘నా వివాహం ఓ ప్రైవేటు వేడుకగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగాలని ఎప్పుడో అనుకున్నా.కావాల్సిన వారు ఆనందంగా ఉండేలా చూసుకోవడం నాకు, చైతూకి చాలా ముఖ్యం. పెళ్లి వైభవంగా నిర్వహిస్తే వచ్చిన అతిథులు ఆ సమయంలో ఎలా ఫీలవుతున్నారో కూడా తెలియదు.అందుకే మా పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే ఇలా ప్లాన్ చేశాం” అని వివరించింది…

ఇది ఇలా ఉండగా..ట్విట్టర్ లో సమంత అక్కినేని అని పేరు మార్చుకుంది సమంత..!

Comments

comments