అన్ని రోజులు “సీత” తన దగ్గరున్నా “రావణుడు” టచ్ కూడా చేయలేదు.! ఎందుకో తెలుసా.? కారణం “రంభ”

నేటి త‌రుణంలో రామాయ‌ణం అంటే తెలియ‌ని వారు ఎవ‌రు..? చాలా మందికి దీని గురించి తెలుసు. రాముడి 14 ఏళ్ల అర‌ణ్య‌వాసం, రావ‌ణుడు సీత‌ను ఎత్తుకెళ్ల‌డం, అత‌న్ని వ‌ధించి సీత‌ను మ‌ళ్లీ వెన‌క్కి తెచ్చుకోవ‌డం… ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శ్లోకాలు, ప‌ద్యాల‌తో కూడుకుని ఆ పురాణం ఉంటుంది. రామాయ‌ణం, అందులోని విశేషాలు, సంఘ‌ట‌న‌లు చాలా మందికి తెలిసిన‌ప్ప‌టికీ దాదాపుగా అనేక మందికి తెలియ‌ని విష‌యం ఇంకోటుంది. అదేమిటో కింద వీడియోలో చూడండి!

watch video here:

ravan-sita

రావ‌ణుడు సీత‌ను ఎత్తుకెళ్తాడు క‌దా..! కొన్ని నెల‌ల పాటు త‌న వ‌ద్దే ఆమెను నిర్బంధిస్తాడు. అనంత‌రం రాముడు సీతను వెతుక్కుంటూ వ‌చ్చి, రావ‌ణున్ని సంహ‌రించి ఆమెను తీసుకెళ్తాడు. అయితే రావ‌ణుని వ‌ద్ద సీత ఉన్న స‌మయంలో ఆమెను రావ‌ణుడు క‌నీసం ముట్టుకోను కూడా లేదు. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఇప్ప‌టి విల‌న్ల‌లాగా అయితే అలాంటి మ‌హాతల్లికి ఎప్పుడో ఆప‌ద సంభ‌వించి ఉండేది. కానీ అంత‌టి రాక్ష‌సుడు అయి ఉండి కూడా రావ‌ణుడు సీత‌మ్మ‌ను అస్స‌లు తాక‌లేదు. ఎందుకంటే…

మీకు రంభ తెలుసు క‌దా..! ఇంద్రుడి ద‌గ్గ‌ర, స్వర్గంలో ఉంటుంది. నిత్యం గానా భ‌జానాలు, మేజువాణీలు… అబ్బో ఆ వైభోగ‌మే వేరు. అయితే రావ‌ణుడు సీత‌ను తీసుకురావ‌డానికి చాలా సంవ‌త్స‌రాల ముందే అత‌ను ఓసారి స్వర్గానికి వెళ్తాడ‌ట‌. అప్పుడు అక్క‌డ ఉన్న రంభ‌ను చూసి రావ‌ణుడు మ‌న‌సు పారేసుకుంటాడు. త‌న‌తో గ‌డ‌పాల‌ని ఆమెను బ‌లవంతం చేస్తాడు. అందుకు రంభ ఒప్పుకోదు. అయినా రావ‌ణుడు వదిలి పెట్ట‌కుండా ఆమె వెంట ప‌డ‌తాడు. ఈ క్ర‌మంలో అది చూసిన రంభ ప్రియుడు న‌ల‌కుబేరుడు రావ‌ణుడికి శాపం పెడ‌తాడు. ఇష్టం లేకున్నా ఎవ‌రైనా యువ‌తుల‌ను ముట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తే అత‌ని త‌ల‌లు ప‌గిలిపోతాయ‌ని అంటాడు. దీంతో చేసేది లేక రావ‌ణుడు వెన‌క్కి త‌గ్గుతాడు. అప్ప‌టికది అయిపోయినా ఆ శాపం అత‌న్ని వెంటాడుతూనే ఉంటుంది. అందులో భాగంగానే సీతను ఎత్తుకెళ్లినా, అన్ని నెల‌ల పాటు త‌న వ‌ద్ద బందీగా పెట్టుకున్నా ఆమెను కనీసం తాక‌ను కూడా తాక‌లేక‌పోతాడు. దాని వెనుక ఉన్న అస‌లు కార‌ణం అది..!

Comments

comments

Share this post

scroll to top